టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్. వై.వీ.ఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్ తొలి సినిమాతోనే డాన్స్‌లు, ఫైట్స్, ఇలా నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హీరోగా 16 ఏళ్ల కెరీర్ పూర్ఇ చేస్తున్న ఇస్మార్ట్ హీరో త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
రామ్‌పోతినేని దేవదాస్ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జగడం అంతగా ఆడలేదు. ఆ తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన రెడి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత చేసిన కొన్ని సినిమాలు హీరోగా రామ్‌కు ఫ్లాప్‌ను అందించాయి. ఇక ఆ తరువాత కందిరీగ మంచి పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా ఎందుకంటే ప్రేమంట, నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగీ వంటి క్లాస్ సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్‌కు మాస్‌లో మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో శంకర్‌గా రామ్ నటన అద్భుతమనే చెప్పాలి.
Advertisement
రామ్ ఇది వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఇస్మార్ట్ శంకర్ సినిమా మరొక ఎత్తు. ఈ చిత్రంతో రామ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ తరువాత ఉస్తాద్ అయిపోయాడు. రెడ్ సినిమాలో కూడా రామ్ పేరు ముందు ఉస్తాద్ అనే పడింది. అప్పటి నుంచి ఆ పేరుకు న్యాయం చేయడానికి మ్యాగ్జిమమ్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ వారియర్ లో నటిస్తున్నాడు. జులై 14న విడుదలవ్వనుంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
రామ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ది వారియర్ టైటిల్ బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అంచనాలకు రావచ్చు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వారియర్ మూవీ కంప్లీట్ అవ్వడమో లేదో వెంటనే మాస్ కా బాప్ బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఒక వైపు సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న రామ్ పెళ్లి విషయంలో కూడా అంతే క్లారిటీతో ఉన్నాడు. త్వరలోనే ఈయన పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. ఆయన స్కూల్‌మేట్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడట. వీరి ప్రేమకు ఇరు కుటుంబ పెద్దలు కూడా ఓకే చెప్పారట. ఎంగేజ్‌మెంట్ ఆగస్టు నెలలో శ్రావణమాసంలో జరిగే అవకాశం ఉంది. పెళ్లి మాత్రం నవంబర్‌లో కార్తీక మాసంలో జరగనున్నట్టు సమాచారం. ఇద్దరి పేర్లపై ముహుర్తం కూడా నిర్ణయమైనట్టు సమాచారం.
Also Read :
భర్త చనిపోతే ఆస్థి భార్యకు రావాలంటే.. ఇది తప్పనిసరి ఉండాల్సిందే..?