చాలా ఏళ్ల తరువాత ఎన్టీఆర్ డైరెక్ట్ చేస్తున్నారు. అది కూడా సామ్రాట్ అశోక్ హిస్టారికల్ మూవీ పెద్దాయన ఓ పట్టుదలతో సినిమా మొదలు పెట్టారు. ఓ తెల్లవారుజామున ఎన్టీఆర్‌ను కలిసేందుకు వచ్చారు మోహన్‌బాబు. అన్నయ్య నీతో నటించాలని ఉందని అడిగాడు. అప్పటికీ మోహన్ బాబు హీరోగా పుల్ స్పీడ్‌లో ఉన్నారు. ఎన్టీఆర్‌కు మోహన్‌బాబు అంటే విపరీతమైన వాత్సాల్యం. తమ్ముడిగా పుట్టకపోయినా తమ్ముడి కిందే లెక్క. అటువంటి తమ్ముడు వచ్చి అడిగితే అన్న కాదంటారా..? వెంటనే స్పందించి మీకు గంట వ్యవధి ఇస్తున్నాఏ పాత్ర వేస్తారో మీరే తేల్చుకోండి అన్నారు ఎన్టీఆర్.
Advertisement
దానికి మోహన్‌బాబు మీరు ఏపాత్ర ఇస్తానన్న చేస్తాను. ఇక ఎన్టీఆర్ కాసేపు ఆలోచించి అశోక చక్రవర్తికి సన్నిహిత మిత్రుడైన రుద్రదేవుడి పాత్ర ఇచ్చారు. ఇక మోహన్ బాబు మొహం వెలిగిపోయింది. ఎన్ని రోజులు అయింది. అన్నయ్య సినిమాల్లో నటించాలనుకుని పాత రోజులను గుర్తు చేసుకున్నాడు మోహన్‌బాబు. షూటింగ్ సమయంలో గ్యాబ్‌లో ఎన్టీఆర్ తో ముచ్చట్లు పెట్టేవారు. ఆ ముచ్చట్లలోనే ఎన్టీఆర్‌తో సినిమా తీయాలనే కోరికను బయటపెట్టారు మోహన్‌బాబు. నేను ఎన్నికల్లో ఓడిపోయాను. ఇప్పుడు నన్ను బిగ్ స్క్రీన్‌పై ఎవ్వరూ చూస్తారని అన్నాడు ఎన్టీఆర్. బసవతారకం ట్రస్ట్ కోసం బయట సినిమా తీయాలని మీడియాతో చెప్పాడు. ఆ వార్త మోహన్‌బాబుకు తెలిసింది.
మీరు బయట సినిమా చేయాలనుకుంటే నాకే చేయండి అని కోరారు మోహన్‌బాబు. ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. ఇక మోహన్‌బాబు ఆనందానికి అవధులు లేవు. కే.రాఘవేంద్రరావుకు ఈ విషయం చెప్పారు. పరుచూరి బ్రదర్స్‌ను కథ సిద్ధం చేయమని కోరారు. ఇదంతా ఆఘమేఘాల మీద జరిగిపోయింది. ఓ శుభ ముహుర్తాన ఎన్టీఆర్‌కు కథ వినిపించారు. నీతికి, నిజాయితికీ, సాహాసానికి నిలువుటద్దంలా నిలిచే ఓ మిలిటరీ మేజర్ కథ. ఇక మేజర్ చంద్రకాంత్ టైటిల్ పెట్టారు. ఇంకేముంది ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వార్త బయటకు రాగానే ఇండస్ట్రీలో చాలా మంది షాక్‌కు గురయ్యారు.
Also Read : ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ : 2010లో రాజమౌళి ఏబీఎన్ ఇంటర్వ్యూ ఇప్పుడూ నెట్టింట్లో వైరల్..!
Advertisement
కానీ మోహన్‌బాబు ఇవేమీ పట్టించుకోలేదు. అన్నయ్య తనను నమ్మి కాల్షిట్స్ ఇచ్చారు. ఈ సినిమాతో బాక్ఆఫీస్ అదరగొట్టాలి. రాత్రింబవళ్లు అదే ఆలోచన. గౌతంరాజు, కీరవాణి తదితర హేమాహేమీలను టెక్నిషియన్‌లుగా పెట్టుకున్నారు. శారద, రమ్యకృష్ణ, నగ్మా లతో పాటు జగ్గయ్య, గుమ్మడి, బ్రహ్మనందం వంటి తారగణాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. 1992 నవంబర్ 20న ముహూర్తం ప్రారంభం అయింది. నారా చంద్రబాబునాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. మంచు లక్ష్మీప్రసన్న క్లాప్‌నిచ్చారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. 1993 ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల అయింది. ఎన్ని రోజులు అయింది ఎన్టీఆర్‌ను ఇలా చూసి అని ప్రేక్షకులు ఉప్పొంగిపోయారు. వాస్తవానికి ఎన్టీఆర్ దశాబ్దం తరువాత చేసిన చిత్రం ఇదే.
మేజర్ చంద్రకాంత్ పాత్రలో ఎన్టీఆర్ విలీనం అయిపోవడంతో అది చూసిన ప్రేక్షకులు సంబరపడ్డారు. ముఖ్యంగా పుణ్యభూమి నాదేశం పాటలో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ గెటప్‌లో కనిపించారు ఎన్టీఆర్. మోహన్ బాబు ఎన్టీఆర్ కుమారుడి పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ తో తనది సూపర్ హిట్ కాంబినేషన్ అని దర్శకుడు కే.రాఘవేంద్రరావు మరొకసారి నిరూపించుకున్నాడు. ఇక చంఢీఘర్‌లో ఆర్మీ జవాన్‌ల మధ్య కూడా షూటింగ్ జరుపుకున్నారు. చివరికీ షూటింగ్ పూర్తయిన తరువాత ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లపోతుంటే అక్కడున్న యూనిట్ సభ్యులందరూ ఏడ్చారట. చిత్రం ద్వాకా మరొక సంఘటన కూడా జరిగింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ కు మోహన్‌బాబు ఎంత డబ్బలు ఇచ్చారనేది ఇప్పటివరకు తెలియదు.
ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకోగానే అడ్వాన్స్‌గా పాతిక లక్షల రూపాయలు ఇస్తుంటే పెద్దగా నవ్వారంట ఎన్టీఆర్. నేను ఏమైనా డబ్బులు అడిగానా.. వద్దు అన్నారట. తీసుకోవాల్సిందేనని మోహన్‌బాబు పట్టుబట్టారు. బ్యాగ్‌లో చేతికి ఎంత వస్తే అంత ఇవ్వమన్నారు. రెండు చేతులు పెట్టి వాటిలో పట్టినంత ఇచ్చాను. అది ఎంత అనేది మాత్రం వారద్దరికే తెలుసు. ఎన్టీఆర్-కే.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఇది 12వ సినిమా. అలాగే నిర్మాతగా మోహన్‌బాబుకు కూడా ఇది 12వ సినిమానే. ఒక రకంగా ఎన్టీఆర్ చివరి సినిమా కూడా ఇదేనని చెప్పాలి. దీంతో పాటు శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా కొంచెం ఆలస్యంగా విడుదల అయంది. ఇక ఈ సినిమా 100 రోజుల పండుగ కూడా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
Also Read : వీలునామా ని రాసేటప్పుడు ఈ తప్పులు చేస్తే అవి చిత్తు కాగితంతో సమానం అని మీకు తెలుసా..?