Home » మహిళా వేషధారణలో పురుషుల పూజలు… వీడియో వైరల్

మహిళా వేషధారణలో పురుషుల పూజలు… వీడియో వైరల్

by Bunty
Ad

కేరళ కొల్లంలోని చవారాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్ కులంగర దుర్గాదేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో వేలాది మంది పురుషులు స్త్రీ వేషధారణలో అందంగా అలంకరించుకొని, బంగారు నగలు ధరించి అమ్మవారిని సేవించేందుకు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలను వెలిగించి అమ్మవారికి దీపారాధన చేస్తారు. రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి.

READ ALSO : IPL 2023 : షారుఖ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వార్.. !

Advertisement

చమయ విలక్కు ఉత్సవాల్లో ట్రాన్స్ జెండర్స్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేస్తారు. పురుషులు స్త్రీగా అలంకరించుకుంటే దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం. కొన్నేళ్లుగా బంధువులు, స్నేహితులతో దుర్గ భగవతిని ఇలా స్త్రీ రూపంలో వచ్ ఇచ సేవించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మలయాళీ నెల మీనం 10, 11వ తేదీల్లో ఘనంగా జరుపుకుంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

Advertisement

READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!

Men Dress up as Women to offer Prayers in Kerala Temple to get blessed with Job & Wealth

ఓ రోజు కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవి ప్రాంతానికి వెళ్లారట. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించిందట. దాన్ని ఆ పిల్లలు అక్కడ కనిపించిన ఓ బండరాయి కేసి పగలగొట్టగా, ఆ రాయి నుంచి రక్తం వచ్చిందట. దాంతో పిల్లలు భయపడి విషయం తల్లిదండ్రులకు చెప్పారట. వారు తల్లిదండ్రులను ఆశ్రయించగా, వారు ఆ రాయిలు వనదుర్గ శక్తి దాగి ఉందని, వెంటనే అక్కడ ఆలయ నిర్మాణం చేయాలని చెప్పారట. అలా అక్కడ దుర్గామాత ఆలయం నిర్మించి, ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారట కుల మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలవారు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొనడం మరో విశేషం.

READ ALSO : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు!

Visitors Are Also Reading