ఆదివారం కొన్ని పనులు చేయకూడదని ధర్మశాస్త్రం చెబుతుందట. ఆ పనులు ఏంటి అనేది తెలుసుకుందాం… ఆదివారం రోజు మాంసాహారం తినకూడదట. మాంసాహారం వండడం కూడా చాలా పెద్ద తప్పు. కానీ మనం ప్రత్యేకించి ఆదివారం రోజే మాంసాహారం తింటూ ఉంటాం. ఆదివారం రోజున మాంసాహారం తినడం వల్ల కుటుంబంలో అశాంతి నెలకొంటుందట.
Advertisement
ఎప్పుడూ గొడవలు, కలహాలు ఉంటాయని ధర్మశాస్త్రం చెబుతుంది. అలాగే ఆదివారం రోజున తలకి నూనె కూడా పెట్టుకోకూడదట. అది ఆయుష్షుకి, ఆరోగ్యానికి హానికరమట. సంభోగం కూడా ఆదివారం రోజున చేయకూడదట. భార్యాభర్తలు ఆదివారం రోజున కలిసినట్లయితే వంశాభివృద్ధి కలగదట. పిల్లల గురించి చేసే ప్రయత్నాలు ఏవి ఫలించవట. అలాగే ఆదివారం రోజున మద్యపానం నిషేధించాలట. ఆదివారం రోజున పార్టీలు, ఫంక్షన్లు అని బయట మందు సేవించే వాళ్ళు ఆదివారం రోజున దానికి దూరంగా ఉండాలట. అలాగే ఆదివారం రోజున ముదురు రంగు దుస్తులు నలుపు, బ్రౌన్ దుస్తులు ధరించడం వల్ల దరిద్రం ఉంటుందట. అసలు ఆరోగ్యానికి మంచిది కాదట. ఆర్థిక నష్టాలు సంభవిస్తాయట.
Advertisement
అలాగే తులసి చెట్టుకు ఆదివారం రోజున నీరు పోయకూడదు. ఎందుకంటే ఆదివారం రోజున తులసి అమ్మవారు వ్రతం చేస్తారు. మనం నీరు పోయడం వలన వ్రతానికి భంగం కలుగుతుంది. ఆదివారం రోజున హెయిర్ కట్ కూడా చేపించుకోకూడదట. బుధవారం, శనివారం రోజున చేయించుకోవాలట. ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. కనుక సూర్యభగవానుడికి భక్తిశ్రద్ధలతో ఒక్కసారి నమస్కారం చేస్తే అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ప్రసాదిస్తాడట.