సినీరగంలో దివంగత ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. ఆయన చేసిన పాత్రలు నా భూతో నా భవిష్యతి ఆయన సాధించిన రికార్డులు కూడా ఎవరు అధిగమించగలరు..? ఆయన అనేక పాత్రలు వేసి మెప్పించారు. ఎవరు ఊహించని అనేక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ పదే పదే మెచ్చుకున్న సినిమా పలుమార్లు తన ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని మరీ చూసిన సినిమా మాత్రం ఒకటి ఉంది. అది మాత్రం ఎన్టీఆర్ సినిమా మాత్రం కాదు. అది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా వాస్తవం.
Advertisement
ఎన్టీఆర్ తన జీవిత కాలంలో బాగా మెచ్చుకున్న సినిమా కన్నడ సూపర్ స్టార్ రాజ్కుమార్ నటించిన భక్త కన్నప్ప. 1954లో విడుదలైన రాజకుమార్ భక్తకన్నప్ప అప్పట్లోనే అన్ని భారతీయ భాషల్లో డబ్బింగ్ అయ్యింది. ఆ సంవత్సరాల్లో ఈ రేంజ్ లో డబ్బింగ్ చేసిన సినిమా ఇది ఒకటే. ఈ సినిమాలో రాజ్ కుమార్ యాక్షన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాను చూసిన ఎన్టీఆర్ అప్పటి నుంచి రాజ్ కుమార్ తో స్నేహం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమాను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు ఎన్టీఆర్.
Advertisement
ఆ తర్వాత కాలంలో భక్తకన్నప్ప సినిమా ఆఫర్ వచ్చినా అన్నగారు వదులుకున్నారు. రాజ్ కుమార్ కు పోటీ కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్వయంగా చెప్పాడు ఎన్టీఆర్. భక్త కన్నప్ప తోపాటు అల్లూరి సీతారామరాజు సినిమా కూడా వదులుకోవడం విశేషం. ఈ రెండు సినిమాల గురించి పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రస్తావించారు. వాస్తవానికి సినీరంగంలో ఒకరిపై ఒకరుకీ అసూయ పోటీ తత్వం ఉన్న కాలంలోనే అన్నగారు ఎంతో విశాల హృదయంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేటి తరానికి కూడా ఆదర్శం అని అంటారు దర్శకులు.
ఆ తర్వాత రాజ్ కుమార్ ఆర్ ఎన్టీఆర్ స్నేహం చనిపోయేంతవరకు చెక్కుచెదరలేదు. ఎన్టీఆర్ ఆర్ ఏ రాజకీయ లోకి వచ్చి సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అవడంతో రాజ్ కుమార్ ఎంతో సంతోషించారు ఇక వీరి తర్వాత వీరి వారసుల మధ్య కూడా ఈ రెండు కుటుంబాల స్నేహం కొనసాగింది. రాజ్ కుమార్ పెద్ద కుమారుడు శివ రాజ్ కుమార్, ఎన్టీఆర్ తనయుడు బాలయ్య తండ్రి లాగానే బెస్ట్ ఫ్రెండ్స్ గానే కొనసాగారు. ఇటీవల మృతి చెందిన రాజ్‌కుమార్ తనయుడు పునిత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి బాలయ్య కర్నాటక వెళ్లి నివాళులర్పించారు. రాజ్‌కుమార్ కుటుంబంతో ఇప్పటికీ బాలయ్య ఎన్టీఆర్‌లాగానే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.