టీమిండియా ఇంగ్లాండ్ కి షాక్ ఇచ్చేటట్టు కనపడుతోంది. జట్టు స్పిన్నర్ జాక్ లీచ్ విశాఖపట్నం వేదికగా జరిగే రెండవ టెస్ట్లో ఆడేది అనుమానంగా ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ లీచ్ మోకాళ్ళకి గాయం అయింది. అయినా అతను సందర్భంగా బౌలింగ్ చేశాడు లీచ్ గాయం తీవ్రత పెరిగింది. గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతో బుధవారం విశాఖపట్నంలో జరిగిన ట్రైనింగ్ సెషన్ కి దూరమయ్యాడు. అతను త్వరగా కోలుకోవాలంటే రెండవ టెస్టు ఆడకుండా ఉండడమే మంచిది అని ఫిజియోలు సూచించినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
అతని గాయం తీవ్రతపై ఇంగ్లాండ్ జట్టు గురువారం అంచనాకి రానుంది. మొదటి టెస్ట్ ఇన్నింగ్స్ లో 26 ఓవర్లు వేసి 63 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ ని తీశాడు గాయంతో బాధపడుతున్న కూడా రెండవ 10 ఓవర్లు వేసి ఒక వికెట్ ని తీశాడు ఒకవేళ కనుక లీచ్ రెండవ టెస్ట్ కి దూరం అయ్యాడు అంటే అతని స్థానంలో యంగ్ ప్లేయర్ బషీర్ డెబ్యూ చేసే అవకాశం ఉంది. తొలి టెస్ట్ తర్వాత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ అవసరమైతే రెండో టెస్ట్లో నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్ లని బరిలోకి దింపుతామని అన్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!