దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఎంతటి గుర్తింపు వచ్చిందో తెలిసిందే. హిందీతో పదిసీజన్లకు పైగా పూర్తి చేసుకున్న ఈ షో తెలుగు, తమిళ భాషల్లోనూ దూసుకుపోతోంది. వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ షో అంటే నచ్చని కొంతమంది బ్యాన్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అలా బిగ్ బాస్ పై సందర్భాన్ని బట్టి నిప్పులు చెరిగే వారిలో సీపీఐ నేత నారాయణ ముందు వరుసలో ఉంటారు. రీసెంట్ గా బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
అయితే సీపీఐ నారాయణ మీడియా మందు మాట్లాడుతూ…బిగ్ బాస్ ఒక లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి స్పందించింది. బిగ్ బాస్ ను బ్రోతల్ హౌస్ అన్నందుకు సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలని కామెంట్ చేసింది. బిగ్ బాస్ షో వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఒకవేళ షో నచ్చకపోతే ఛానల్ మార్చుకోవాలని తమన్నా సలహా ఇచ్చారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఓటీటీ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ సీజన్ లో మొత్తం 17 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు.