ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న దేవిశ్రీప్రసాద్… థమన్ ల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతునే అనేక ఇతర భాషల సినిమాలకు కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వీరిద్దరూ తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలకు కూడా సంగీతాన్ని అందించారు.
Advertisement
తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేర్ వీరయ్య సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా… వీర సింహారెడ్డి మూవీకి థమన్ సంగీతం అందించాడు. ఈ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అలాగే ఈ రెండు సినిమాల సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం కూడా వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది హీరోల మూవీలకు సంగీతాన్ని అందిస్తున్నారు. తమన్ కంటే చాలా సంవత్సరాల ముందే దేవిశ్రీప్రసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.
Advertisement
థమన్… మణిశర్మ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. మణిశర్మ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన థమన్ “కిక్” సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీలోని మ్యూజిక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో అప్పటినుండి వరుస అవకాశాలను దక్కించుకున్న థమన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఒక సినిమాకు థమన్ అసిస్టెంట్ గా పని చేశాడు. సినిమా ఏమిటి అనుకుంటున్నారా… అదే నాగార్జున హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన కింగ్ మూవీ. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ప్రతి సాంగ్ కి కీ బోర్డు ప్లేయర్ గా థమన్ పనిచేసాడు. ఈ సంగీత దర్శకుడు ఈ సినిమా తర్వాత కీ బోర్డ్ ప్లేయర్ గా ఏ సినిమాకు పని చేయలేదు.