Home » వాడికి పనిస్తే…మాకు ఈ పని చేశాడు…తమన్ ఎమోషనల్…!

వాడికి పనిస్తే…మాకు ఈ పని చేశాడు…తమన్ ఎమోషనల్…!

by AJAY
Ad

కొత్త సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. సినిమాలోని సీన్లు, పాటలు, ఫోటోలు ఇలా ఏదో ఒకటి విడుదల అవ్వడం వల్ల మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుండి గతంలో టీజర్ లీక్ అయింది. ఇక ఇప్పుడు ఇదే సినిమా నుండి కళావతి అనే పాట కూడా లీక్ అయింది. కాగా దీనిపై తాజాగా సంగీత దర్శకుడు తమన్ స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తమన్ సోషల్ మీడియాలో ఓ ఆడియోను షేర్ చేశారు.

Advertisement

ఆడియోలో….. మనసుకు చాలా బాధగా ఉందని తమన్ వ్యాఖ్యానించాడు. ఆరు నెలల నుండి ఈ పాట వీడియో కోసం ఎంతగానో కష్టపడ్డామని… రాత్రి పగలు పని చేసామని చెప్పారు. ఈ పాట షూటింగ్ సమయంలో తొమ్మిది మందికి కరోనా వచ్చిందని…మేము మా హీరో గారికి చూపించాల్సిన ప్రేమ, అభిమానం ఈ పాట లో ఉండే ప్రాణం….. కవి రాసిన అద్భుతమైన లిరిక్స్.. మా డైరెక్టర్ గారు ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్ వీడియో…. మేము ఎంతో హ్యాపీగా వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్ మాస్టర్ మిక్సింగ్ టెక్నాలజీ ఉపయోగించామని తమన్ చెప్పారు.

Advertisement

అలా ఎంతో కష్టపడి పాటను తయారు చేస్తే ఎవడో ఈజీగా నెట్ లో పెట్టేసాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడాలో తెలియడం లేదని వాడికి పని ఇస్తే వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదన్నారు. గుండె తరుక్కుపోతోందని…. కోపం గా ఉండాలా బాధపడాలా అర్థం అవ్వట్లేదు అని పేర్కొన్నారు. ఎంతో హార్ట్ బ్రేకింగ్ ఉందని తను మామూలుగా అయితే ఇలా హర్ట్ అవ్వను అని పేర్కొన్నారు. తను ఎంతో స్ట్రాంగ్ గా ఉంటానని…. కానీ ఇలా పబ్లిక్ డొమైన్లో ఆడియో పెట్టడానికి కారణం ఈ తప్పు చేసినవాడికి పైరసీ వల్ల ఏం జరుగుతుందో తెలియాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్ ఆడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading