Home » ఆ సినిమా కోసం విజయ్ కి అన్ని కోట్ల రెమ్యూనరేషన్… కోలీవుడ్ లోనే టాప్..!

ఆ సినిమా కోసం విజయ్ కి అన్ని కోట్ల రెమ్యూనరేషన్… కోలీవుడ్ లోనే టాప్..!

by AJAY
Ad

తమిళ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఆఖరుగా వారిసు సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో విడుదల అయ్యి కోలీవుడ్… టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. వారిసు సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా… అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే విజయ్… లోకేష్ కాంబినేషన్లో మాస్టర్ అనే మూవీ రూపొంది మంచి విజయం సాధించడంతో ఈ మూవీపై విజయ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీని ఈ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత విజయ్ తాజాగా కస్టడీ అనే సినిమాకు దర్శకత్వం వహించినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. లియో మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాగానే విజయ్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు.

vijay

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం విజయ్ కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు ఏ హీరో తీసుకొని రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ కి 150 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు… ఇది కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు ఏ హీరో కూడా తీసుకొని రేంజ్ రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది.

Visitors Are Also Reading