చాలామంది తేనె ని వాడుతూ ఉంటారు తేనె విషయంలో కల్తీ కూడా జరుగుతూ ఉంటుంది మీరు వాడుతున్న తేనే కల్తీదా లేదంటే స్వచ్ఛమైనదా అనేది ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. తేనె స్వచ్ఛతను గుర్తించడానికి వాటర్ డిసోల్యూషన్ టెస్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసుకోవాలి. మంచి తేనె అయితే నీటిలో సులభంగా కరగదు. గ్లాసు అడుగుకి వెళ్ళిపోతుంది. సులభంగా కరిగిపోతే అది కల్తీదని తెలుసుకోవాలి.
Advertisement
Advertisement
తేనె ని చాలా కంపెనీ వాళ్ళు చెరకు, వరి, మొక్కజొన్న వంటి సిరప్‌లు వేసి తేనె అని అమ్మేస్తున్నారు. నీళ్లలో ఇవి ఈజీగా కరుగుతాయి. ఇలా ఈజీగా టెస్ట్ చెయ్యచ్చు. పేపర్ టవల్ టెస్ట్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుంది. తేనె ని పేపర్ టవల్ షీట్ మీద వేస్తె.. ఒరిజినల్ తేనె అయితే దాన్ని త్వరగా పీల్చుకోలేదు. తేనె స్టేబుల్‌గా ఉంటుంది. పేపర్ టవల్ షీట్ తేనెను త్వరగా పీల్చుకుంటే కల్తీ అయ్యిందని తెలుసుకోవాలి.
Also read:
- Dussehra 2023: నవరాత్రుల్లో ఏ రోజు ఎలా అలంకరణ చెయ్యాలి..? వేటిని నైవేద్యంగా పెట్టాలంటే..?
- Dussehra 2023: నవరాత్రుల్లో ఉపవాసం చేసేవాళ్ళు… ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి..!
- కాఫీ పొడి తో అందం రెట్టింపు.. బ్యూటీ పార్లర్ ఖర్చు కూడా మిగులుతుంది..!