సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ దుమ్ము లేపింది. మరోసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. విశాఖలోని వైయస్సార్ స్టేడియంలో శనివారం రాత్రి భోజ్పురి దబాంగ్ జట్టుతో జరిగిన ఫైనల్ లో పోటీలో తెలుగు వారియర్స్ జట్టు అదరగొట్టింది. టాస్ఓడి తోలుతా బ్యాటింగ్ కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ను 10 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
READ ALSO : బ్రేక్ తొక్కబోయి ఎక్సలేటర్ తొక్కాడు.. తిరుపతిలో కారు బీభత్సం
Advertisement
ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల ఆదిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది.
Advertisement
READ ALSO : భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!
58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయ లక్ష్యాన్ని సాధించింది. అశ్విన్ 31 పరుగులు చేశాడు. స్పాన్సర్ల ద్వారా పాస్ లతో అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. ఫైనల్స్ లో తెలుగు వారియర్స్ ఆడుతుండడంతో తమ అభిమాన తారల ఆటను వీక్షించేందుకు తరలివచ్చారు. జట్టు మెంటల్ వెంకటేష్ అభిమానులను ఉత్సాహపరిచాడు.
READ ALSO : మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక