Home » అన‌సూయ నుండి వంట‌ల‌క్క‌ వ‌ర‌కూ హీరోయిన్ ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న బుల్లితెర న‌టీమణులు వీళ్లే.!

అన‌సూయ నుండి వంట‌ల‌క్క‌ వ‌ర‌కూ హీరోయిన్ ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న బుల్లితెర న‌టీమణులు వీళ్లే.!

by AJAY
Ad

ప్ర‌స్తుతం థియేట‌ర్ ల‌లో సినిమాలు చూసేవారి సంఖ్య చాలావ‌ర‌కూ కానీ త‌గ్గింది. అయితే టీవీ చూసేవాళ్ల సంఖ్య‌మాత్రం అస్స‌లు త‌గ్గ‌లేదు. దాంతో బుల్లితెర తార‌లు కూడా భారీగా రెమ్యున‌రేష‌న్ లు పుచ్చుకుంటున్నారు. అయితే ఎవ‌రెవ‌రు ఎంత పుచ్చుకుంటున్నారో ఇప్పుడు ఓ లుక్ వేద్దాం..

tollywood-anchors-and-education

Advertisement

తెలుగులో నంబ‌ర్ 1 యాంక‌ర్ సుమ ఒక్కో ఆడియో ఫంక్ష‌న్ కు రూ.2 నుండి రూ.2.50వేల వ‌ర‌కూ పుచ్చుకుంటుది. అంటే సుమ దాదాపుగా నెల‌లో క‌నీసం 10 ఆడియో ఫంక్ష‌న్ లు అయినా చేస్తుంది. అలా నెల‌కు రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కూ సంపాదిస్తుంది.

ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టిస్తున్న అనసూయ యాంక‌ర్ గా కూడా భారీగానే పుచ్చుకుంటుంది. అన‌సూయ ఒక్కో ఆడియో ఫంక్ష‌న్ కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకుంటుంది.

జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ యాంక‌ర్ ర‌ష్మి. ఈ ముద్దుగుమ్మ ఆడియో ఫంక్ష‌న్ కు ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కూ పుచ్చుకుంటుంది. అంతే కాకుండా సినిమాలు మరియు టీవీ షోలలో కూడా బిజీగా ఉంటుంది.

Advertisement

కార్తీక‌దీపం సీరియ‌ల్ తో అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టి ప్రేమివిశ్వ‌నాథ్ కూడా ఫుల్ గా సంపాదిస్తుంది. ఒక్క ఎపిసోడ్ కే వంట‌ల‌క్క రూ.30 నుండి రూ.50 వేల వ‌ర‌కూ డిమాండ్ చేస్తున్న‌ట్టు టాక్.

ఇక టాలీవుడ్ బిజీగా ఉండే మ‌రోయాంక‌ర్ శ్రీముఖి కూడా ఫుల్ గా సంపాదిస్తోంది. శ్రీముఖి ఒక్కో ఈవెంట్ కు ల‌క్ష వ‌ర‌కూ తీసుకుంటుంది. అంతే కాకుండా టీవీ షోలు సినిమాలు కూడా చేస్తుంది. టీవీ న‌టి ప‌ల్ల‌వి రామిశెట్టికి కూడా యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు మ‌రియు సీరియ‌ల్స్ ద్వారా రోజుకు రూ.15 వేల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. ఒక‌ప్పుడు సినిమా హీరోయిన్ గా న‌టించిన సుహాసిని ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ లో హీరోయిన్ గా న‌టిస్తోంది. కాగా సీరియ‌ల్స్ లో ఒక్కో ఎపిసోడ్ కు రూ.30 వేల వ‌ర‌కూ పుచ్చుకుంటుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చదవండి

Visitors Are Also Reading