Home » “కాంతార” సినిమాను పొగడాలంటే తెలుగు సినిమాను తిట్టాలా…? అసలు మనవాళ్ళు చేసిన ఈ 4 సినిమాలు చూశారా..?

“కాంతార” సినిమాను పొగడాలంటే తెలుగు సినిమాను తిట్టాలా…? అసలు మనవాళ్ళు చేసిన ఈ 4 సినిమాలు చూశారా..?

by AJAY
Ad

తెలుగువారు ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమాను అయినా అదరిస్తారు. ఈ విషయాన్ని పక్క ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే చాలాసార్లు మీడియా ముఖంగా చెప్పారు. సినిమా బాగుందంటే అది ఏ భాషలో తెరకెక్కింది…? నటీనటులు ఎవరు అనేది పక్కన పెట్టి థియేటర్ల ముందు క్యూ కడతారు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఆ సినిమాపై ప్రశంసలు కురిపిస్తారు.

Also Read:  10 ఏళ్ల క్రితమే రామ్ చరణ్ అల్లు అర్జున్ హీరోలు గా మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన అల్లు అరవింద్ ..! ఆ సినిమా టైటిల్ ఇదే ..?

Advertisement

రీసెంట్ గా వచ్చిన కన్నడ సినిమా కంతార సినిమా కు కూడా తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా నచ్చితే చూడటం లో పొగడటం లో అసలు తప్పే లేదు. అయితే ఇక్కడ కొంతమంది మేధావులు అని చెప్పుకునేవాళ్లు తెలుగు సినిమాను..నటులను విమర్షిస్తూ కాంతార సినిమా పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఇండియాలోనే టాలీవుడ్ టాప్ లో ఉంది.

బాలీవుడ్ నటీనటులే వచ్చిన మన సినిమాల్లో నటిస్తున్నారు అంటే టాలీవుడ్ స్థానం ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు. కంతార రియలిస్టిక్ గా ఉంది. రిషబ్ శెట్టి నటన సూపర్…ఒప్పుకోవచ్చు కానీ అలాంటి సినిమాలు అంతకు మించిన సినిమాలు తెలుగులో లేవా..? రంగస్థలం సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఈ సినిమా లోనూ మన కల్చర్ ను చూపించారు. ఈ సినిమాలో నటీనటులు ఎక్కడా తగ్గలేదు. 

Advertisement

Also Read:  ఆ ఓటిటీ చేతికి “యశోద” డిజిటల్ రైట్స్ !

అంతే కాకుండా మల్లేశం సినిమాలో కూడా తెలంగాణ కల్చర్ కనిపిస్తుంది. ఇది కూడా రియలిస్టిక్ గా ఉంటుంది. అదే విధంగా పలసా సినిమా కూడా రియలిస్టిక్ గా ఉంటుంది.

ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిన్న సినిమా. కానీ పెద్ద హీరోలు ఎవరూ ఈ సినిమా ను ప్రమోట్ చేయలేదు.

దాంతో ఈ సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది తక్కువే. అంతే కాకుండా కంచెరపలెం సినిమా కూడా ఇలాంటి సినిమానే. చాలా తక్కువ బడ్జెట్ తో ఓకే ఊరిలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ఈ సినిమా క్లైమక్స్ లో ఓ రేంజ్ లో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. కాకపోతే అవి తెలుగు సినిమానా విమర్శించేవాళ్ళకు ఎక్కవేమో.

Also Read:  సినిమాల్లో నటించాలంటే సభ్యత్వం ఉండాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు..!!

Visitors Are Also Reading