సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ కు క్రేజ్ ఎక్కువ. బడ్జెట్ విషయంలో కానీ ఇక్కడి నటులకు సినిమాపై ఉండే డెడికేషన్ విషయంలో కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సౌతిండియాలోనే టాప్ ఫిల్మ్ ఇండస్ట్రీ! అందుకే సౌత్ ఇండియాలోని తమిళ్, కన్నడ, మళయాల ఇండస్ట్రీలపై పైచేయి మనదే! ఆఆ భాషల్లో కూడా మన తెలుగు హీరోలు టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆ హీరోస్ ఎవరో ఇప్పుడు చూద్దాం!
తమిళ్ ఇండస్ట్రీ : మహేష్ బాబు
తెలుగు హీరోల్లో తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరో అంటే మహేష్ బాబు. మహేష్ బాబు చాలా సినిమాలు తమిళ్ లో డబ్ అవుతాయి. విజయ్ కెరీర్ ను టాప్ రేంజ్ లోకి తీసుకెళ్లిన రెండు సినిమాలు పోకిరి, ఒక్కడు మహేష్ బాబు సినిమాలు కావడంతో అక్కడి ప్రేక్షకులకు మహేష్ మీద అభిమానం ఎక్కువ. బాహుబలి తర్వాత ప్రభాస్ కి కూడా అక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది. తండ్రి ఫ్యాన్ పాలోయింగ్ మహేష్ కు కలిసొచ్చింది.
Advertisement
Advertisement
కన్నడ ఇండస్ట్రీ : NTR
కన్నడ లో NTR హవా బాగా నడుస్తుంది. మొదటినుండి నందమూరి వంశానికి రాయలసీమ లో మంచి రెస్పాన్స్ ఉంటుంది. అదే రెస్పాన్స్ పక్కనున్న కర్నాటకకు కూడా పాకింది. అందుకే బాలకృష్ణ తర్వాత NTR సినిమాలు కన్నడలో చాలా బాగా ఆడతాయి. అరవింత సమేత కన్నడలో 10 కోట్లు కలెక్ట్ చేసింది.
మళయాలం ఇండస్ట్రీ : అల్లు అర్జున్
అల్లు అర్జున్ ను కేరళలో మల్లు అర్జున్ అంటారు. డాన్స్ లు ఫైట్ , స్టైల్ అల్లును కేరళ ఆడియన్స్ కు కనెక్ట్ చేసింది. కేరళ స్థానిక హీరోలతో సమానమైన ఫాలోయింగ్ బన్నీకి సొంతం. బన్నీ సరైనోడు మూవీ దాదాపు 3 కోట్లు కలెక్ట్ చేసింది.