రోజు మనం వందలాది కాల్స్ మాట్లాడుతుంటాం. మనకు కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ డేటా పై కేంద్రం ఓ కొత్త నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు కాల్స్ డేటాను ఏడాది వరకు మాత్రమే భద్రపరిచేవారు. కానీ, ఇప్పుడు ఈ కాల్స్ డేటాను రెండేళ్ల వరకు పోడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్స్ డేటాను రెండేళ్ల వరకు డేటాను భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణ కాల్స్‌తో పాటుగా, ఇంటర్నెట్ కాల్స్ ను కూడా రెండేళ్ల వరకు భద్రపరచనున్నారు. దీనికోసం అదనంగా ఎలాంటి ఖర్చులు ఉండబోవని, కాల్స్ ను టెక్ట్స్ రూపంలో ఎక్స్ఎల్ షీట్‌లో భధ్రపరుస్తారని టెలికామ్ సర్వీస్‌లు చెబుతున్నాయి. టెలికమ్యునికేషన్ లైసెన్స్ అగ్రిమెంట్ క్లాజ్ 39:20 ప్రకారం టెలికమ్యునికేషన్ శాఖ పరిశీలన కోసం ఏడాది పాటు కాల్ డేటా రికార్ఢ్‌ను భద్రపరచాలి. కాగా, తాజా కేంద్రం ఆదేశాల మేరకు దానిని రెండేళ్లకు పెంచారు. ఐపీ నెంబర్ ఆధారంగా కాల్స్ వివరాలను కేంద్రం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Advertisement