Home » తెలంగాణ స్టాఫ్ నర్స్ పోస్టులకు 40,100ల దరఖాస్తులు..పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ స్టాఫ్ నర్స్ పోస్టులకు 40,100ల దరఖాస్తులు..పూర్తి వివరాలు ఇవే

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు మంగళవారంతో ముగిసాయి. మొత్తం 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు దాదాపు 40,100ల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష ద్వారా తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) వీరిని ఎంపిక చేయనుంది. రాత పరీక్షలో సాధించిన మార్కులతో పాటు, వెయిటేజీ మార్కులను కూడా కలపనున్నారు. రెండింటిని కలిపి తుది మెరిట్ లిస్టును ప్రకటిస్తారు.

Advertisement

Advertisement

వెయిటేజీ ఎలా నిర్ణయిస్తారంటే.. ఇప్పటికే ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న వారికి, గతంలో పనిచేసిన వారికి వెయిటేజీ మార్కులు కేటాయించనున్నారు. రాత పరీక్షను 80 పాయింట్లకు, మిగిలిన 20 పాయింట్లకు వెయిటేజీ ఆధారంగా కేటాయిస్తారు. ఈ విధంగా మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. వెయిటేజీ ప్రాంతాన్ని బట్టి కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన, చేస్తున్నవారికి ఆరు నెలలకు 2.5 పాయింట్లు చొప్పున కేటాయిస్తారు. ఇతర ప్రాంతాల్లో సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు. అంటే ఇతర ప్రాంతాల్లో 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులవుతారు.

Read also : అతడు సినిమాలో ఆ సీన్ ను.. త్రివిక్రమ్ కాపీ కొట్టారని మీకు తెలుసా?

Visitors Are Also Reading