Home » ఆర్టీసీ బ‌స్సు లో పుట్టిన ఆ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉచిత ప్ర‌యాణం

ఆర్టీసీ బ‌స్సు లో పుట్టిన ఆ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉచిత ప్ర‌యాణం

by Bunty
Ad

తెలంగాణ ఆర్టీసీ ఎమ్ డి గా… సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి…. ఆర్టీసీ లాభాల్లో దూసుకుపోతుంది. ఆఫర్లు, బహుమతులు ప్రకటిస్తూ తెలంగాణ ఆర్టీసీ ని పరుగులు పెట్టిస్తున్నారు ఎండి సజ్జనార్. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎండీ స‌జ్జనార్‌. తెలంగాణ ఆర్టీసీ బస్సులో పుట్టిన ఇద్దరు చిన్నారులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు సజ్జనార్. ఇక నుంచి ఆ ఇద్దరు చిన్నారులు జీవిత కాలం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు.

Advertisement

Advertisement

దానికి సంబంధించిన ఫ్రీ పాస్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఫ్రీ పాస్ తో ఇద్దరు చిన్నారులు జీవితకాలం తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి వీలు ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణ ఆర్టీసీ బస్సులో గత నెల 7వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా లో చిన్నారి జన్మించింది. అలాగే ఈనెల ఏడో తేదీన సిద్దిపేట జిల్లాలో మరో చిన్నారి జన్మించింది.

దీంతో ఆ ఇద్దరు చిన్నారులకు తెలంగాణ ఆర్టీసీ జీవితకాలం ఫ్రీ ఇవ్వనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అలాగే ఈ రోజు గురువారం కావడంతో బస్సు దినోత్సవాన్ని… నిర్వహించాలని అధికారులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ బస్సు దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులు మరియు సిబ్బంది బస్సులోనే ప్రయాణం చేయాలని పేర్కొన్నారు సజ్జనార్.

Visitors Are Also Reading