తెలంగాణ రాష్ట్రంలో మే 06 నుంచి ఇంటర్మీడియల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 23న ముగుస్తాయి. ఈ పరీక్షల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు వెల్లడించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెడితే నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
Advertisement
ఆన్‌లైన్‌లో www.tsbie.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే ఆదేశించినట్టు తెలిపారు. హాల్ టికెట్లపై ముద్రించబడిన పేరు, ఫోటో, సంతకం, మీడియం, సబ్జెక్టుల వంటి వివరాలను ఓసారి సరి చూసుకోవాలని.. ఏమైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలని సూచించారు.
Advertisement
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలను రాయనున్నారు. పరీక్షల కోసం 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇక జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల తేదీలలో మార్పులు చేసారు. షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణలో మే 06 నుండి 23 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
Also Read :
సర్కారు వారి పాట డైలాగ్‌లు : Sarkaru Vaari Paata Movie Dialogues
“ఆచార్య” సినిమాకి మొదట అనుకున్న కథ ఇదేనా ? ఇది తీసుకుంటే బ్లాక్ బస్టర్ పక్కా పడేది..!