తెలంగాణ గురుకుల నోటిఫికేషన్లపై గుడ్ న్యూస్. తెలంగాణలో గురుకుల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పోస్టుల సంఖ్య మరో రెండు వేలు పెరగనుంది. ఇందుకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీప్రక్రియ వేగంగా సాగుతోంది. అయితే టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మాత్రం ఇంకా నిరాశ తప్పడం లేదు. అయితే వీరికి త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Advertisement
పోస్టుల సంఖ్య మరో రెండు వేలకు పైగా పెరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, గురుకులాల్లో మరో రెండు వేలకు పైగా పోస్టుల్ని ఆయా సొసైటీలు గుర్తించాయి. త్వరలో జారీ చేయనున్న గురుకుల నియామక నోటిఫికేషన్ లలో భాగంగా వాటిని నింపేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయా సొసైటీలు ప్రతిపాదనలు పంపించాయి. త్వరలో ఈ పోస్టులకు అనుమతులు రానున్నట్లు అధికార వర్గాల నుంచి సమాచారం.
Advertisement
ఈ అనుమతులు లభిస్తే గురుకులాల్లో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య 13 వేలకు పైగా చేరుకోనున్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో 11,012 పోస్టులకు భర్తీకి అనుమతులు లభించాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే తాజాగా మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ, గురుకులాల పోస్టులు కలిపి ఒకేసారి ప్రకటనలు విడుదల చేయాలని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ భావిస్తోంది.
READ ALSO : ఒంటరిగా.. బెడ్ రూమ్ కు రమ్మన్నాడు – ఆమని సంచలన వ్యాఖ్యలు..