Home » లగ్జరీ హెలికాప్టర్ కొన్న కరీంనగర్ వాసి.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు..రేటు ఎంతో తెలుసా ?

లగ్జరీ హెలికాప్టర్ కొన్న కరీంనగర్ వాసి.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు..రేటు ఎంతో తెలుసా ?

by Bunty
Ad

యాదాద్రిలో అభివృద్ధి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత యాదాద్రిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించింది తెలంగాణ సర్కార్ అత్యంత వైభవంగా తీర్చిదిద్దింది. ఇందుకోసం ప్రత్యేక యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ఆథారిటి ను ఏర్పాటు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

ఓవైపు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వైటిడిఏ తాజాగా శిల్ప కళాశాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్టలో కొత్త హెలికాప్టర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తకారులు, బైక్స్ కొన్నవారు ఎవరైనా ప్రత్యేక పూజలు చేయడం చాలా కామన్. కానీ ఓ వ్యక్తి ఏకంగా హెలికాప్టర్ కు ప్రత్యేక పూజలు చేసి అందర్నీ ఆకర్షించాడు.  కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రతిమ మెడికల్ కళాశాల ఎండి ప్రతిమ గ్రూప్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాసరావు నూతనంగా కొనుగోలు చేసిన హెలికాప్టర్ ను యాదగిరిగుట్టకు తీసుకువచ్చారు.

Advertisement

హెలికాప్టర్ ను టెంపుల్ సిటీలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ చేశారు. పూజారులు అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు బంధువైన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పూజల అనంతరం హెలిక్యాప్టర్ లో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులు గిరి ప్రదక్షిణ చేశారు. బోయినపల్లి శ్రీనివాసరావు టెంపుల్ సిటీలోని ప్రెసిడెంట్ సూట్ విల్లా డోనర్ కావడంతో వాహన పూజలు ఉచితంగా నిర్వహించారు. అయితే ఈ హెలికాప్టర్ దాదాపు రూ. 46 కోట్లు ఉన్నట్లు సమాచారం అందుతుంది.

READ ALSO : Avatar-2 Review in Telugu : ‘అవతార్‌ 2’ రివ్యూ

Visitors Are Also Reading