Home » Telangana: తెలంగాణకు మరో సెంట్రల్ మినిస్టర్ పదవి.. ఆ ఎంపికే ఛాన్స్ ఉందా..?

Telangana: తెలంగాణకు మరో సెంట్రల్ మినిస్టర్ పదవి.. ఆ ఎంపికే ఛాన్స్ ఉందా..?

by Sravanthi
Ad

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.. ఇప్పటికే అన్ని పార్టీలు వారి వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రజల వద్దకు వెళుతున్నాయి.. ఈ వేడిని చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలోనే బిజెపి తనకు దొరికిన ప్రతి ఛాన్స్ ను ఉపయోగించుకుంటుంది. ఓవైపు బి ఆర్ ఎస్ మరోవైపు కాంగ్రెస్ లో ఉన్నటువంటి అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునేంaదుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. దానికోసమే బిజెపి తెలంగాణ టీం అనేక ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో కాస్త పుంజుకుంది అని చెప్పవచ్చు.

Advertisement

also read:కృష్ణ వ‌దిలేసిన ఈ సినిమా చిరంజీవికి లైఫ్ ఇచ్చింది!?

ప్రస్తుతం బి ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి అంటున్నారు నాయకులు.. ఈ తరుణంలోనే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు మరొక కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తోంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీ సీట్లు గెలిచారు. ఇందులో ఒకటి కరీంనగర్ నుంచి బండి సంజయ్, అదిలాబాదు నుంచి సోయం బాబూరావు, యూపీ నుంచి లక్ష్మణ్. నిజాంబాద్ నుంచి ధర్మపురి అరవింద్ , సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి. ఇందులో కిషన్ రెడ్డికి ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి ఉంది. ఇక బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

Advertisement

బిజెపి గెలిచిన నాలుగు సీట్లలో మూడు సీట్లు ఉత్తర తెలంగాణ నుండే విజయం సాధించారు. ఈ తరుణంలో ఉత్తర తెలంగాణకే ప్రాముఖ్యత ఇచ్చి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టాలని బిజెపి ఐకమై ప్రయత్నాలు చేస్తోంది. అయితే హైదరాబాద్ నుండి ఇప్పటికే కిషన్ రెడ్డి పదవిలో ఉన్నారు. అయితే మళ్లీ లక్ష్మణ్ కు కేంద్రమంత్రి పదవి ఇస్తే హైదరాబాదులో ఇద్దరికీ ఎలా ఇస్తారు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇక మిగిలిన మరో వ్యక్తి ధర్మపురి అరవింద్. కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కేంద్రం పెద్దలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో ఓ కామెంట్ ద్వారా తెలియజేయండి.

also read:

Visitors Are Also Reading