తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తేజ ఒకరు. ఈయన చిత్రం, జయం, నువ్వు నేను మూవీలతో హైట్రిక్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిజం అనే మూవీ ని రూపొందించాడు.
Advertisement
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ మహేష్ కు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన జలక్ ఇచ్చింది. అలా నిజం మూవీ తర్వాత అనేక సంవత్సరాలు అనేక అపజయాలను ఎదురుకున్న ఈ దర్శకుడు నేనే రాజు నేనే మంత్రి మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా తేజ, సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో అహింస అనే మూవీ ని రూపొందించాడు.
Advertisement
అభిరామ్ కు ఇదే మొదటి సినిమా. ఈ మూవీ తాజాగా విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తేజ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో చేయవలసిన సినిమా ఎందుకు ఆగిపోయిందో అనే విషయాలను కూడా వివరించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో తేజ, పవన్ తో సినిమా చేయాలి అని అనుకున్నాడట.
అందులో భాగంగా ఒక కథను కూడా తయారు చేసుకుని పవన్ కి వినిపించాడట. కానీ కథ మొత్తం విన్న పవన్, తేజ మొహం మీద ఈ కథ అస్సలు బాలేదు అని చెప్పాడట. అలా పవన్ రిజెక్ట్ చేసిన కథను మరో హీరోతో తెరకెక్కించిన తేజ భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. మరి అదే సినిమా అనుకుంటున్నారా అదే నిజం. నిజం మూవీ కథను మొదట పవన్ రిజెక్ట్ చేయగా అదే కథను మహేష్ కు వినిపించి ఒప్పించి ఆయనతో మూవీని రూపొందించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను ఎదుర్కొంది.