సొంత గడ్డమీద ఓడిన టీమ్ ఇండియా రెండవ మ్యాచ్ లో ఎలా అయినా గెలవాలని చూస్తోంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ లని ఎదుర్కోవడానికి ఇండియన్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో రెండు మ్యాచ్ లో దాన్ని పునరావృతం చేయొద్దని పట్టుదలతో ఇండియన్ ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. రెండవ టెస్ట్ కోసం విశాఖపట్నం చేరుకున్న క్రికెటర్లు స్పిన్ బౌలింగ్ లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ కనపడ్డారు. భారత్ స్పిన్నర్ లని ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రయోగించిన ప్రధాన అస్త్రం స్వీప్ షాట్.
Advertisement
Advertisement
ఈ షాట్ ని భారత్ ప్లేయర్లు తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. మామూలుగా టీమిండియా బ్యాటర్లు ఈ షాట్ ని ఎక్కువగా ఆడరు. కానీ ఇంగ్లాండ్ స్పిన్నర్స్ కి చెక్ పెట్టాలని లక్ష్యంతో ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు. మొదటి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగతా ప్లేయర్లు స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నం చేశారు అందుకే వికెట్లు పడిపోయాయని తెలుస్తోంది ఇంగ్లాండ్లో రెండవ టెస్ట్ కోసం రోహిత్ శర్మ, గిల్, రజాక్ స్వీప్ షాట్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనబడ్డారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!