Home » కెప్టెన్ల కంటే ఎక్కువ ఓపెనర్లను మారుస్తున్న టీం ఇండియా… ఎందుకు..?

కెప్టెన్ల కంటే ఎక్కువ ఓపెనర్లను మారుస్తున్న టీం ఇండియా… ఎందుకు..?

by Azhar
Ad

ఈ ఏడాది ఇప్పటివరకు ఈ జులైను కాపీలు మొత్తం ఏడు నెలలు కాగా మన ఇండియా జట్టుకు ఏడుగురు కెప్టెన్లగా వ్యవరించారు. అయితే జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ.. పలు రకాల కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. గాయం, రెస్ట్, కరీనా పాజిటివ్ గా రావడం ఇలాంటి కారణంగా రోహిత్ లేకపోవడంతో జట్టుకు కెప్టెన్లు ఎక్కువగా అయ్యారు. కానీ ఇప్పుడు మన జట్టు కెప్టెన్ ల కంటే ఎక్కువగా ఓపెనర్లను మార్చడం చర్చగా మారింది.

Advertisement

నిన్న విండీస్ తో జరిగిన తొలి టీ20 లో ఇండియా కు ఓపెనర్ గా రోహిత్ శర్మతో పటు సూర్య కుమార్ యాదవ్ వచ్చాడు. ఈ విషయం అందర్నీ షాక్ కు గురి చేసింది. అయితే సూర్య కుమార్ ఈ ఏడాది మన జట్టుకు ఓపెనర్ గా వ్యవరించిన 9వ ఆటగాడిగా సూర్య నిలిచాడు. ఇంతకంటే ముందు మన జట్టుకు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, రిషబ్ పంత్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా ఉన్నారు. అయితే మన జట్టు ఇలా వరుసగా ఓపెనర్లను మార్చడానికి కారణం ఏంటి అనేది తెలియడం లేదు.

Advertisement

అయితే త్వరలో జరగబోయే ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసే ఆటగాడి కోసం టీం ఇండియా ప్రయత్నిస్తుంది అనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ రెగ్యులర్ గ ఉన్న ఓపెనర్లలో మంచి వారిని వెతకాలి.. లేదంటే వారినే బాగా తాయారు చేయాలి. కానీ ఇలా మిడిల్ ఆర్డర్ లో బాగా రాణిస్తున్న సూర్య, దీపక్ వంటి ఆటగాళ్లను ఓపెనింగ్ కు పంపి వారి లయ ను దెబ్బ తీయకూడదు అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే నిన్న సూర్యను ఓపెనర్ గా చేసిన జట్టు.. ఈ 5 టీ20ల సిరీస్ మోత దానిని కొనసాగిస్తుందా లేదా అనే విషయం చూడాలి మరి.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..!

రాహుల్ ద్రావిడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కైఫ్…!

Visitors Are Also Reading