Home » టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. టెస్ట్ ల్లోనూ నెంబర్ వన్..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. టెస్ట్ ల్లోనూ నెంబర్ వన్..!

by Anji
Ad

సాధారణంగా భారత జట్టు టెస్ట్ క్రికెట్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది.  నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలిటెస్ట్ లో విజయం సాధించడం ద్వారా నాలుగు పాయింట్లు పొంది అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 115 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా వన్డే, టీ-20 క్రికెట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా టెస్ట్ లో అగ్రస్థానం అందుకుంది. దీని ద్వారా మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలిచిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. మరోవైపు భారత్ తో తొలిటెస్ట్ లో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండు స్థానంలో ఉంది.

Advertisement

ఇంగ్లండ్ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 100 పాయింట్లతో నాలుగు, సౌతాఫ్రికా 85 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్  వికెట్ల వేటతో ఆసీస్ భరతం పట్టారు. మరోవైపు  వన్డేలలో టీమిండియా 114 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత 112 పాయింట్లతో ఆసీస్ జట్టు రెండో స్థానం, న్యూజిలాండ్ 111 పాయింట్లతో మూడో స్థానం, 111 పాయింట్లతో నాలుగో స్థానంలో, పాకిస్తాన్ జట్టు 106 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. టీ-20లో భారత జట్టు 267 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 266 పాయింట్లతో రెండో స్థానంలో, 258 పాయింట్లతో పాకిస్తాన్ మూడు స్థానంలో, దక్షిణాఫ్రికా 256 పాయింట్లతో నాలుగో స్థానంలో, న్యూజిలాండ్ జట్టు 252 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. 

Advertisement

Also Read :   ఆ ఇద్దరు క్రికెటర్లు ‘గే’లు.. బయటపడ్డ వారి సీక్రెట్ రిలేషన్ ?

ముఖ్యంగా ఒకే సమయంలో మూడు ఫార్మాట్స్ లలో భారత జట్టు నెంబర్ వన్ గా అవతరించడం ఇదే తొలిసారి. ఇటీవల ఓ సమయంలో సోషల్ మీడియాలో అన్ని ఫార్మాట్లలో టీమిండియా నెంబర్ వన్ గా అవతరించిందని వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తను భారత జట్టు నిజం చేసి  రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ఘనత సాధించడంతో హిట్ మ్యాన్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. టీమిండియాను అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలిపిన కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ గెలవడం ద్వారా టీమిండియా వన్డేలలో నెంబర్ వన్ ర్యాంకు అందుకుంది. ఆ తరువాత న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీ-20 ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ వన్ గా అవతరించింది. ఈ సిరీస్ కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించినప్పటికీ.. అధికారికంగా మాత్రం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. దీంతో రోహిత్ టీమిండియాను అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలిపిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. 

Also Read :   Valentine’s Day : భారత కెప్టెన్ రోహిత్ శర్మ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading