ఒంగోలు పై పట్టు సాధించడానికి టీడీపీ కసరత్తు చేస్తోంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీట్ తో పాటుగా అసెంబ్లీ సెగ్మెంట్ కి కూడా ఇన్చార్జ్ దొరకట్లేదు. అభ్యర్థులు కసరత్తు రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా కూడా అక్కడ పోటీ చేయడానికి సరైన అభ్యర్థి దొరకట్లేదని టాక్ వినపడుతోంది. చివరి నిమిషంలో సీటు దక్కక వచ్చే వలస నేతల కోసమే పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తుంది ఒంగోలు ఎంపీ స్థానాన్ని టిడిపి ఇప్పటిదాకా కేవలం రెండుసార్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఆ సీటు మీద వైసిపి జెండా పాతింది.
Advertisement
Advertisement
అటువంటి చోట టిడిపి గెలుపు పై ఆపసోపాలు పడుతోంది. 2014లో టీడీపీ నుండి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓడిపోయారు. ఆయన ఎమ్మెల్సీ గా కొన్నాళ్లు కొనసాగించారు తర్వాత ఎన్నికల సమయానికి వైసీపీలో చేరిపోయారు. తర్వాత అక్కడ సిద్ధ రాఘవరావు బరిలో నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో సిద్ధ ఓడిపోయారు. కొంతకాలం తర్వాత సిద్ధ కూడా వైసీపీలో చేరారు అప్పటినుండి టీడీపీ కి ఒంగోలులో ఇన్చార్జి లేకుండానే నెట్టుకు వస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!