ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. రాష్ట్ర ప్రజల కోసం జగన్‌ను గద్దె దింపాలని 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా 40 శాతం ఓట్లు తెచ్చుకుందంటున్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వచ్చే ఎన్నికలు, పొత్తులపై మాట్లాడారు. పొత్తుల కోసం వెంపర్లాడకుండా ప్రజల టీడీపీపై పెట్టుకుంటున్న అనుగుణంగా ప్రభుత్వంపై పోరాడాలి.
Advertisement
పొత్తుల కోసం వెంపర్లాడకుండా ప్రజలు టీడీపీపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వంపై పోరాడాలని అన్నారు. అప్పుడు ఏ పార్టీ అయితే పొత్తు కోసం వస్తుందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100-110 వస్తాయని.. ఇప్పటి నుంచే ఎందుకు ఇప్పటి నుంచే జనసేనతో పొత్తు, బీజేపీతో పొత్తునే చర్చ ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వాలంటీర్లలో 50 నుంచి 70 శాతం మంది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాపులు అందరినీ కలుపుకుని వెళ్లాలని పేర్కొన్నారు.
Advertisement
కేవలం కాపులు మాత్రమే ఓట్లు వేస్తే ప్రభుత్వం రాదని, కుల బలాన్ని బట్టి ముఖ్యమంత్రి అవుతారని సరైంది కాదని, అప్పుడే విజయం సాధిస్తారని.. తనకు కూడా అందరి ఓట్లు పడితేనే గెలిచామని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్నికల సమయానికి అది తుఫాన్ మాదిరిగా విరుచుకుపడుతుందన్నారు రామానాయుడు. చంద్రబాబు అసెంబ్లీ చేసిన శపథం కచ్చితంగా నెరవేరుతుందన్నారు. టీడీపీ ఎప్పుడు ఓటమి చెందిన ఈ పార్టీని గెలిపించాలో తమ కార్యకర్తలకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు.
అధికారంలోకి వచ్చిన తరువాత 20 నుంచి 30 ఏళ్లు అధికారంలో ఎలా ఉండాలో నేర్చుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చాక పది పదిహేనేళ్లపాటు అధికారంలో ఉండేలా పాలన ఉండాలని చంద్రబాబుకు సలహాగా చెబుతున్నామన్నారు. వైఎస్సార్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. టీడీపీ తరుపున తాము 15 మంది మాత్రమే సభకు వెళ్తున్నామన్నారు. 15 మంది సభ్యులకు 151 మంది అధికార పార్టీ సభ్యులు ఎందుకు సమాధానం చెప్పలేక పోతున్నారని ప్రశ్నించారు. శాసన సభలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడాన్ని సహించలేక పోతున్నారని తాను ఏమి మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడుతానన్నారు. తాను సాక్ష్యాలు, ఆధారాలు చూపించి అసెంబ్లీలో ప్రశ్నించడంతో వాళ్లు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎదురుదాడి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read : ప్రపంచంలోనే అతిపెద్ద రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో వెనుకబడడానికి కారణం ఏమిటో తెలుసా..?