Telugu News » Blog » ప్ర‌పంచంలోనే అతిపెద్ద ర‌ష్యా సైన్యం ఉక్రెయిన్‌లో వెనుక‌బ‌డ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ర‌ష్యా సైన్యం ఉక్రెయిన్‌లో వెనుక‌బ‌డ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Ads

ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తిమంతమైన, అతిపెద్ద సైనిక శ‌క్తి ఉన్న దేశాల్లో ర‌ష్యా ఒక‌టి. కానీ ఉక్రెయిన్ పై ప్రారంభ దండ‌యాత్ర‌లో ర‌ష్యా సాయుధ బ‌ల‌గాల ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించ‌లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై యుద్ధ‌రంగంలో ర‌ష్యా ప్ర‌ద‌ర్శ‌న‌పై ప‌శ్చిమ దేశాల‌కు చెందిన చాలా మంది మిలిట‌రీ విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. ర‌ష్యా ప్ర‌ద‌ర్శ‌న నిరుత్సాహంగా ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ర‌ష్యా మిలిట‌రీ పురోగ‌మ‌నం చాలా వ‌ర‌కు నిలిచిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కోల్పోయిన న‌ష్టాల నుంచి ర‌ష్యా మిలిట‌రీ కోలుకోగ‌ల‌దా..? అని కొంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు త‌మ ల‌క్ష్యాల‌ను ర‌ష్య‌న్లు అందుకోలేద‌నేది సుస్ప‌ష్టం. ఇక‌ముందు కూడా ఇలాగే ఉండ‌వ‌చ్చు అని సీనియ‌ర్ నాటో మిలిట‌రీ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. ర‌ష్యా విష‌యంలో అస‌లు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది..? ర‌ష్యా మిలిట‌రీ చేసిన పొర‌పాట్ల గురించి సీనియ‌ర్ పాశ్చాత్య మిలిట‌రీ అధికారులు, నిఘా వ‌ర్గాలు ఈ విధంగా వెల్ల‌డించాయి.


ర‌ష్యా చేసిన మొద‌టి త‌ప్పు ఉక్రెయిన్ సాయుధ బ‌ల‌గాల సామ‌ర్థ్యాల‌ను, ప్ర‌తిస్పంద‌న శ‌క్తిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం, సాయుధ బ‌ల‌గాల‌పై ర‌ష్యా వార్షిక బ‌డ్జెట్ 60 బిలియ‌న్ డాల‌ర్లు (రూ.4.55ల‌క్ష‌ల కోట్లు) కంట ఎక్కువ కాగా.. ఉక్రెయిన్ కేవ‌లం ప్ర‌తి సంవ‌త్స‌రం 4 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే. అన‌గా (30.378 కోట్ల వ‌ర‌క ఖ‌ర్చు చేస్తుంది. ఆ స‌మ‌యంలో అనేక మందితో పాటు ర‌ష్యా కూడా త‌మ సొంత బ‌ల‌గాల సామ‌ర్థ్యాన్ని అధికంగా ఊహించుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ త‌మ బ‌ల‌గాల ఆధునీక‌ర‌ణ చేప‌ట్టాడు. ఆధునీక‌ర‌ణ‌తోనే ఎక్కువ‌గా న‌మ్మకం క‌లిగి ఉండ‌వ‌చ్చు.

Also Read :  నందీశ్వ‌రుడికి, శివ‌లింగానికి మ‌ధ్య మ‌నుషులు న‌డ‌వ‌కూడ‌దా..?

ర‌ష్యా పెట్టుబ‌డుల్లో అధిక భాగం హైప‌ర్ సోనిక్ క్షిప‌ణుల వంటి కొత్త ఆయ‌యుధాల‌ను అభివృద్ధి చేయ‌డం, అతిపెద్ద న్యూక్లియ‌ర్ ఆయుధ‌శాల‌ల‌ను ఏర్పాటు చేయ‌డంపైనే వెచ్చింద‌ని బ్రిటిష్ సీనియ‌ర్ మిలిట‌రీ అధికారి ఒక‌రు అన్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత అధునాత‌న‌మైన టీ-14 అర్మాటా ట్యాంకును ర‌ష్యా నిర్మించింది. రెడ్ స్క్వేర్ వ‌ద్ద మాస్కో విక్ట‌రీ డే ప‌రేడ్‌లో క‌నిపించిన ఈ యుద్ధ‌ట్యాంకు యుద్ధ క్షేత్రంలో క‌నిపించ‌ట్లేదు.

ర‌ష్యా యుద్ధ‌భూమిలో దింపిన వాటిలో చాలా పాత టీ-72 యుద్ధ ట్యాంకులు, సాయుధ బ‌ల‌గాల వాహ‌నాలు, ఫిరంగులు, రాకెట్ లాంఛ‌ర్లున్నాయి. దాడి ప్రారంభంలో ఉక్రెయిన్ వైమానిక ద‌ళంపై ఆధిపత్యం ప్ర‌ద‌ర్శిస్తూ ర‌ష్యా యుద్ధ విమానం స‌రిహ‌ద్దుల వ‌ర‌కు వెళ్లింది. ఈ స‌మ‌యంలో గ‌గ‌న త‌లంపై ప‌ట్టు సాధించేందుకు ర‌ష్యాకు మంచి అవ‌కాశం ల‌భించింది. గ‌గ‌న త‌లంపై ర‌ష్యా బ‌ల‌గాలు తొంద‌ర‌గా ప‌ట్టు సాధిస్తాయ‌ని అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా జ‌రిగింది.


ఉక్రెయిన్‌వైమానిక సేన‌లు ఇప్ప‌టికీ ప్ర‌భావ‌వంతంగానే క‌నిపిస్తున్నాయి. ర‌ష్యా ఎత్తుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కుంటాయి. ప్రత్య‌ర్థిని త్వ‌ర‌గా నిర్ణ‌యాత్మ‌క దెబ్బ కొట్ట‌డంలో త‌మ ప్ర‌త్యేక బ‌ల‌గాలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని మాస్కో అనుకొని ఉండ‌వ‌చ్చు. స్పెట్స్‌నాట్జ్ వీడీవీ పారా ట్రూప‌ర్ల వంటి బ‌ల‌గాల‌ను మోహ‌రించి ప్ర‌త్య‌ర్థిపై ప‌ట్టు సాధించాల‌ని తొలుత ర‌ష్యా భావించింద‌ని ఓ సీనియ‌ర్ పాశ్చాత్య ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. ఈ దాడి తొలిరోజులోనే కీయెవ్‌కు వెలుప‌ల హోస్టోమెల్ విమానాశ్ర‌యంపై హెలికాప్ట‌ర్ దాడుల‌ను ఉక్రెయిన్ తిప్పికొట్టింది. దీంతో బ‌ల‌గాల‌ను, ప‌రిక‌రాల‌ను, యుద్ధ సామాగ్రిని తీసుకురావ‌డం ర‌ష్యాకు క‌ష్ట‌మైంది.

Also Read :  ఈ 5 అద్భుత‌మైన‌ టిప్స్ పాటిస్తే మీ బైక్ మైలేజీ పెర‌గ‌టం ప‌క్కా…!


You may also like