Home » గాంధీభవన్ లో టీడీపీ జెండాల హవా…తెలంగాణ-ఏపీ మళ్ళీ కలుస్తాయా ?

గాంధీభవన్ లో టీడీపీ జెండాల హవా…తెలంగాణ-ఏపీ మళ్ళీ కలుస్తాయా ?

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ కు 60 సీట్లు కావాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు గెలుచుకుంది. దీంతో రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లోకి రాగానే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి… గాంధీభవన్ కు భారీ ర్యాలీతో బయలుదేరారు.

Advertisement

గాంధీభవన్ ముందు సంబరాలలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే రేవంత్ రెడ్డి ర్యాలీలో టిడిపి జెండాలు ఉన్నాయి. అలాగే గాంధీభవన్ ముందు కూడా టిడిపి నేతలు టిడిపి జెండాలతో గంతులు వేశారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మెడకు వివాదంగా చుట్టుకుంది. కాంగ్రెస్ పార్టీలో టిడిపి రక్తం ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

అటు రేవంత్ రెడ్డి, గాంధీభవన్ ముందు టిడిపి జెండాలు ఉండటం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి బిజెపి కావాలి… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని టిడిపి భావిస్తుందని… అసలు చంద్రబాబు పార్టీకి సిద్ధాంతాలు లేవని ఫైరయ్యారు. అధర్మమే ఆయుధంగా 40 సంవత్సరాలు రాజకీయం చేసిన చంద్రబాబు ఇప్పుడు ధర్మాన్ని కాపాడమని దేవుడిని కోరుకోవడం ఏంటని నిలదీశారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading