Home » త‌రుణ్ ఏమ‌య్యాడు..? ఎక్క‌డున్నాడు ..?

త‌రుణ్ ఏమ‌య్యాడు..? ఎక్క‌డున్నాడు ..?

by Bunty
Ad

తరుణ్ ఎంతో మంచి పేరు ఉన్న చైల్డ్ ఆర్టీస్ట్. హీరోగా ఎదిగాక బిగినింగ్ డేస్ బాగున్నా.. ప్ర‌స్తుతం క‌నుమరుగై పోయాడు. త‌రుణ్ చివ‌ర‌గా న‌టించిన సినిమా ఇది నా ల‌వ్ స్టోరీ . గ‌త మూడున్న‌రేండ్లుగా క‌నిపించ‌ని త‌రుణ్ అస‌లు ఏమైపోయాడు..? ఎక్క‌డున్నాడు..? ఎందుకు సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ఏదో ఒక సినిమాతో బౌన్స్ బాక్ అవుతాడ‌ని సినిమావాళ్లు, సాధార‌ణ ప్రేక్ష‌కులు భావిస్తూనే ఉన్నారు. కానీ త‌రుణ్ మాత్రం ఒక క్వ‌శ్చ‌న్ మార్కు లాగానే మిగిలిపోతున్నాడు. త‌రుణ్ సినిమాలు తీయ‌కుండా ఏదైనా బిజినెస్‌తో బిజిగా ఉన్నాడా లేక‌.. ఇంకా ఏదైనా ప‌ని చేస్తున్నాడా..? అనే విష‌యం కూడా బ‌య‌ట‌ ప్ర‌పంచానికి తెలియ‌డం లేదు. న‌టిస్తాడా లేదా అనే విష‌యం ఇప్పుడు పెద్ద అనుమానంగా మారిపోయింది. తేజ అనే సినిమాతో చైల్డ్ ఆర్టీస్ట్‌గా న‌టించాడు త‌రుణ్‌.

Advertisement

 

నువ్వె కావాలి వంటి సూపర్ డూప‌ర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు త‌రుణ్‌. ఈ సినిమా చూసిన వారంద‌రూ ఒక రేంజ్‌లో ఎదిగి పోతాడ‌నే అనుకున్నారు. కానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. ప్రియ‌మైన నీకు, నువ్వులేక నేను లేను, నువ్వె.. నువ్వె.. వంటి సినిమాలు కూడా త‌రుణ్‌కు మంచి హిట్‌ను అందించాలి.

Advertisement

అత‌నికి ల‌వర్ బాయి ఇమేజ్ కూడా వచ్చింది. ఎంత‌టి చ‌క్క‌గా ఉంటాడంటూ ప్రేక్ష‌కులు మురిసిపోయారు. కాస్త త‌క్కువైనా కూడా చ‌లాకిగా ఉంటూ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఇక స్టార్ హీరోగా ఎదుగుతున్నాడ‌నుకున్న త‌రుణంలోనే అత‌ని కెరీయ‌ర్ ఘోరంగా విఫ‌లం చెందింది. క్యారెక్ట‌ర్లు, స‌బ్జెక్టులు ఎంపిక చేసుకోవడ‌మే ఇందుకు కార‌ణం అంటున్నారు. నిన్నే ఇష్ట‌ప‌డ్డాడు, ఎలా ఇష్ట‌ప‌డ్డానుస‌ఖియా, సొగ్గాడు వంటి సినిమాలు అత‌ని త‌ప్పు సెలక్ష‌న్‌కు ఉదాహ‌ర‌ణ‌.

ఇవ‌న్నీ కెరీయ‌ర్ బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ఇక కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో శ‌శిరేఖ ప‌రిణ‌యం కూడా ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌లేదు. ముఖ్యంగా త‌రుణ్ మార్కెట్ అప్ప‌టికే డౌన్ కావ‌డంతో ఇలా జ‌రిగింది. ఆ త‌రువాత త‌రుణ్ కెరీయ‌ర్ అనూహ్యంగా దెబ్బ తింది. చుక్క‌లాంటి అమ్మాయి-చ‌క్క‌నైన అబ్బాయి సినిమా ప‌దే ప‌దే వాయిదా పడుతూ.. శ‌శిరేఖ ప‌రిణ‌యం వ‌చ్చిన నాలుగేళ్ల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. జ‌నం ఆదరించ‌లేదు. అయినా వెంట‌నే యుద్ధం, వేధ వంటిసినిమాలు కూడా వ‌చ్చాయి. కానీ ఫ‌లితం శూన్యం. ముఖ్యంగా త‌రుణ్ కొన్ని సినిమాలు ఎప్పుడు విడుద‌ల‌య్యాయో.. ఎప్పుడు విడిపోయాయో, ఎప్పుడు విడుద‌ల‌య్యాయో కూడాతెలియ‌దు. త‌రుణ్ కామా మాత్ర‌మే పెట్టాడా.. లేక సినిమాల‌కు పులిస్టాప్ కూడా పెట్టాసాడా..? అని చాలా మందికి సందేహాలు క‌లిగి ఉన్నాయి. ఇప్ప‌టికీ అనేక మంది స్టార్లు టాలీవుడ్ ఏలుతుండ‌గా.. అనేక మంది కొత్త వాళ్లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మూడున్న‌రేండ్లుగా క‌నిపించ‌ని త‌రుణ్ అస‌లు ఏమై పోయాడు.. ఎక్క‌డున్నాడు అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్య‌నారు హీరో త‌రుణ్ గురించి. చూడాలి మ‌రి త‌రుణ్ మ‌ర‌ల సినిమాల్లో న‌టిస్తారో లేదో అనేది.

 

Visitors Are Also Reading