ప్రస్తుతం ఎక్కడ చూసిన తారకరత్న, తారకరత్న, తారకరత్న.. అంతటి గొప్ప వ్యక్తి మరణాన్ని నందమూరి అభిమానులు, ప్రజలు జీర్ణించు కోలేకపోతున్నారు.. ఆయన ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ మరొకరికి మాత్రం అన్యాయం చేయలేదు. ఆయన కంటే పెద్దవారైనా, చిన్నవారినైనా చాలా ఆప్యాయంగా రిలేషన్షిప్ తో పిలిచేవారు. నందమూరి కుటుంబం అని ఏనాడు కూడా గర్వం చూపించేవారు కాదు. అందుకే పెద్దలు అన్నారు, మంచి వాళ్లకు తొందరగా చావు వస్తుందని. ఇది తారక రత్న విషయంలో పక్కా జరిగింది..
Advertisement
ఆయన లేని లోటు నందమూరి కుటుంబంలో ఎవరూ భర్తీ చేయలేరు. అలాంటి తారకరత్న బ్రతికి ఉంటే త్వరలో ప్రభాస్తో నటించే వారట .. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 2003లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో అశ్వినీదత్ నిర్మాణంలో హీరోగా మారిన తారకరత్న. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ముందుకు వెళ్తుండేవాడు. అలాంటి తారకరత్నతో మహానటి ఫిలిం డైరెక్టర్ నాగ్ అస్విన్ డైరెక్షన్లో ప్రభాస్ త్వరలో “ప్రాజెక్టుకే” మూవీ రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
Advertisement
ఇందులో తారకరత్నను ఒక కీలక పాత్రలో ఎంపిక చేయాలని నిర్మాత అశ్విని దత్ అనుకున్నారట. దీనిపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చర్చలు కూడా జరిపినట్టు నిర్మాత అశ్వినిదత్ తెలియజేశారు. ఇంతలోనే తారకరత్న జనవరి 27వ తేదీన గుండెపోటుకు గురికావడం 23 రోజులుగా ప్రాణాలతో పోరాడి ఫిబ్రవరి 18న తుది శ్వాస విడవడం బాధాకరమని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గుర్తు చేసుకున్నారు.
also read: