ఒకటోనంబర్ కుర్రాడు అని ప్రేక్షకులు ప్రేమతో పిలుచుకునే తారకరత్న ఇకలేరు. సినిమాలు మరియు రాజకీయాల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తారకరత్న గుండెపోటు రావడంతో కొన్నిరోజుల పాటూ మృత్యువుతో పోరాడి మరణించారు. ఇక తారకరత్న జీవితంలో ఎన్నో ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి. అందులో చాలా మందికి తెలియని వియషం ఆయన వివాహం. తారకరత్న ప్రేమవివాహం చేసుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన అలేఖ్యరెడ్డిని తారకరత్న ప్రేమించారు.
Advertisement
అయితే అప్పటికే అలేఖ్యరెడ్డికి వివాహం కాగా భర్తతో విభేదాలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు. ఇక తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్యరెడ్డి డిజైనర్ గా పనిచేశారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక అలేఖ్యరెడ్డి తో పరిచయం కాస్తా కొంతకాలం తరవాత ప్రేమగా మారింది. చాలా మంది సెలబ్రెటీలు ప్రేమించి ఆ తరవాత బ్రేకప్ లు చెప్పడం కామన్. కానీ తారకరత్న అలా కాదు.
Advertisement
ప్రేమించిన అమ్మాయి కోసం కుటుంబాన్ని ఎదిరించాడు. ఆమె కోసమే తన సినిమా జీవితంను కూడా పట్టించుకోలేదు. అన్యోన్యంగా కలిసి ఉంటూ చాలామందికి ఆదర్శం అయ్యాడు. ఇదిలా ఉంటే తారకరత్న పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 2012లో అలేఖ్యరెడ్డిని తారకరత్న చిలుకూరు బాలాజీ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. కాగా 2013 లో వీరి ప్రేమకు గుర్తుగా కూతురు నిషిక జన్మించింది. ఇక తారకరత్న కన్నుమూసిన తారవాత ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవ్వడం చూపి అభిమానులు ప్రేక్షకులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ALSO READ :నందమూరి తారకరత్న అరుదైన చిత్రాలు