ఒకటోనంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తారకరత్న మొదటిసినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నందమూరి వారసుడుగా ఎంట్రీ ఇస్తూనే ఏకంగా తొమ్మిది సినిమాల్లో తారకరత్న నటించాడు. కానీ తారకరత్న కెరీర్ ఆ తరవాత డీలా పడిపోయింది. వరుస సినిమాలలో నటించినా సరైన హిట్ పడలేదు. కానీ ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా తెలుగు ప్రేక్షకులు మాత్రం తారకరత్నను మరిచిపోలేదు.
Advertisement
గుండెల్లో పెట్టుకున్నారు. దానికి కారణం తారకరత్నకు ఎలాంటి వివాదాలు లేకపోవడమే. ఇక ఇప్పుడిప్పుడే తారక్ కెరీర్ మళ్లీ స్పీడ్ అందుకుంటోంది. అటు సినిమాల పరంగా ఇటు రాజకీయాల పరంగా తారకరత్న దూసుకుపోతున్నాడు. కానీ అలాంటి సమయంలోనే ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడం కుటుంబ సభ్యులను ప్రేక్షకులను విషాదంలోకి నెట్టివేసింది. ఇదిలా ఉంటే తారకరత్నకు సంబంధించి పలు ఆసక్తికర వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇక తారక్ కెరీర్ లో ఆయనకు రెండు సినిమాలు ఎంతో స్పెషల్..వాటిలో ఒకటి తారక్ సినిమా అయితే మరొకటి యువరత్న సినిమా అని తెలుస్తోంది. తారకరత్న రెండో సినిమా యువరత్న. ఈ సినిమాకు బాలయ్య ముద్దుపేరు అని యువరత్న అనే టైటిల్ ను పెట్టుకున్నారు.
కాబట్టి ఈ సినిమా తారకరత్నకు ఎంతో స్పెషల్ అని తెలుస్తోంది. అదే విధంగా తారకరత్న మూడో సినిమా పేరు తారక్…ఈ సినిమాకు తన పేరునే టైటిల్ గా పెట్టారు. దాంతో ఈ సినిమా కూడా తారకరత్నకు ఎంతో స్పెషల్ అని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ తరవాత కూడా తారకరత్న కెరీర్ స్లో గా సాగింది.