Taraka Ratna Marriage, Wife: టాలీవుడ్ హీరో నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారక్ కు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా తారకరత్న త్వరగా కోలుకోవాలని తిరిగి సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తారకరత్న కు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే తారకరత్న లవ్ స్టోరీ కూడా వైరల్ అవుతుంది. 2012లో తారక్ పెద్దలను ఎదిరించి అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. అలేఖ్య రెడ్డి ఓ ఇంటర్వ్యూ లో తమ లవ్ స్టోరీ బయటపెట్టింది. తారకరత్న చెన్నైలో తన సోదరికి స్కూల్ లో ఆమెకి సీనియర్ అని తెలిపింది. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా తాము హైదరాబాదులో కలిసామని చెప్పింది.
Advertisement
Advertisement
మొదట ఇద్దరం స్నేహితులుగా ఉన్నామని కానీ ఆ తర్వాత తారకరత్న ప్రపోజ్ చేశాడని తెలిపింది. దాంతో తాను కుటుంబ సభ్యులతో మాట్లాడమని సూచించినట్లు తెలిపింది. కానీ వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదని దానికి కారణం… సినిమా ఇండస్ట్రీపై వారికి మంచి అభిప్రాయం లేదని చెప్పింది. అంతేకాకుండా నందమూరి కుటుంబ సభ్యులు కూడా తమ పెళ్ళికి ఒప్పుకోలేదని చెప్పింది.
తారకరత్న ఫ్యామిలీ కూడా పెళ్లికి ఒప్పుకోలేదని దానికి కారణం తాను అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నానని తెలిపింది. తాను కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటానని అనుకోలేదని కానీ ఆ సమయంలో తన అంకుల్ విజయసాయిరెడ్డి మద్దతుగా నిలిచారని చెప్పింది. అంతేకాకుండా తాము 2012 ఆగస్టు 2న హైదరాబాదులోని సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నామని వెల్లడించింది. తమ పెళ్ళికి ఇరు కుటుంబాల నుండి ఎవరూ హాజరు కాలేదని తెలిపింది.