Home » Breaking : లోకేష్ యాత్రలో అపశ్రుతి…తారకరత్న కు గుండెపోటు….! ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ?

Breaking : లోకేష్ యాత్రలో అపశ్రుతి…తారకరత్న కు గుండెపోటు….! ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ?

by AJAY

Nandamuri Taraka Ratna: టాలీవుడ్ నటుడు తారకరత్న తీవ్ర అస్వస్థకు గురయ్యారు. లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నేడు తారకరత్న యాత్ర లో నడుస్తూ ఒక్కసారిగా పడిపోయారు. కాగా తారకరత్న కు గుండెపోటు వచ్చినట్టు టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు.

అంతేకాకుండా ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన తర్వాత ఆయన పల్స్ రేటు మెరుగుపడిందని ఆయన చెబుతున్నారు. మొదట తారకతను కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం ఆయనను బెంగళూరుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తారకరత్న కు ప్రాణాపాయం లేదని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. తారకరత్న ఆస్పత్రిలో చేరిన వెంటనే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆసుపత్రిలోనే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

తారకరత్న కోలుకుంటారని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. బాలకృష్ణ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తారకరత్న ఒకటవ నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా విలన్ గా చాలా సినిమాలు చేశాడు. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయాలలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Also read : chiranjeevi: అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ మూవీ..?

Visitors Are Also Reading