Ad
మన టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది టాప్ హీరోలు ఉన్నారు. అలాగే టాప్ రేంజ్ లో కొన్ని ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. అందులో నందమూరి కుటుంబం కూడా ఒక్కటి. టాలీవుడ్ ను స్థానిపించిన వారిలో ముఖ్యుడైన నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ ఇది. అయితే ఈ కుటుంబం నుండి ఇప్పుడు వచ్చిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే టాప్ హీరోగా మారాడు. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. కానీ ఈ కుటుంబం నుండి హీరోగా వచ్చి వెల్లిపోనా వ్యక్తి తారకరత్న.
అయితే ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ లోకి వచ్చిన తారకరత్న మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఏకంగా 13 సినిమాలు ఒప్పుకున్న ఆయన కొన్ని రోజులకే సరైన హిట్ లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మళ్ళీ ఆ తర్వాత నెగెటివ్ పాత్రలో వచ్చి ప్రయత్నించాడు కానీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న మాత్రలో కనిపించాడు. కానీ ఆయన ఇపుడు మళ్ళీ 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా అభిమానుల ముందుకు వస్తున్నాడు. దీనికోసం చేస్తున్న ప్రమేషన్స్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన.
తారకరత్న మాట్లాడుతూ… చాలా మంది అప్పట్లో నేను జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా వచ్చాను అనుకున్నారు. కానీ అది తప్పు. ఎన్టీఆర్ టాప్ హీరో అయిన మా నందమూరి ఫ్యామిలీ పేరే కదా పైకి వెళ్ళేది అని చెప్పాడు. అలాగే ఈ మధ్య తాను నందమూరి కుటుంబానికి దూరమైనట్లు.. మాకు ఆస్తి గొడవలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదు. నేనేమి నందమూరి కుటుంబానికి దూరం కాలేదు.. నన్ను ఎవరు దూరం పెట్టలేదు. అలాగే మాకు ఏ రకమైన ఆస్తి గొడవలు లేవు అని తారకరత్న క్లారిటీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆల్ ఔట్ ఐన నేపాల్..!
శ్రీశాంత్ ను కొట్టడం పై స్పందించిన హర్భజన్…!
Advertisement