ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు.. ఆయన ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తన కెరీర్ లోనే ఎప్పుడు లేనంత పాము లో ఉన్నారు. ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు. తన కెరియర్ స్టాటింగ్ లో ఎన్ని హిట్లు వచ్చినా స్టార్డం రావడానికి తక్కువ సమయం పట్టింది.. కానీ ఎన్టీఆర్ ను తన ఫ్యామిలీని గుర్తించే సమయం మాత్రం ఆలస్యమైందని చెప్పవచ్చు. ఆయన తన తాత ఎన్టీఆర్ లాగానే పోలి ఉన్నారని టాక్ జనాల్లో ఉండటంవల్ల జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా క్రేజ్ పెరిగింది.
Advertisement
అందుకే ఎన్టీఆర్ ను సినిమాల్లోకి తీసుకురావడానికి హీరోగా పరిచయం చేస్తూ ఏకంగా తొమ్మిది సినిమాలకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాప్ కొట్టారు.. ఇదంతా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కు 11 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తన తాత సీనియర్ ఎన్టీఆర్ తో అనుబంధమే లేదట. అప్పటి వరకు తాతను ఒక్కసారి కూడా చూసిన సందర్భం లేదని ఎన్టీఆర్ ఒక సందర్భంలో చెప్పారు. ఒక రోజు ఎన్టీఆర్ తీవ్రమైన జ్వరం అంటే 104 డిగ్రీల జ్వరంతో బాధ పడుతూ ఉండగా ఎన్టీఆర్ పిఏను జూనియర్ ఎన్టీఆర్ వద్దకు పంపారట.
Advertisement
దీంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర జ్వరంతో బాధ పడుతూనే అబిడ్స్ లో ఉన్న తన తాతని చూడడానికి ఆయన ఇంటికి వెళ్ళాడట. ఆ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఏదో దేవాలయంలోకి వెళ్ళినట్టుగా అనిపించిందని, లోపల్నుంచి ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలతో దగ్గరకు వచ్చారని, ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకుని నీ పేరేమిటి అని ప్రశ్నించారని, ఆ విధంగా ఆయన తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా ప్రశ్నలు అడిగారని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. తాత తో నాకు ఉన్న సంబంధాన్ని మర్చిపోలేనని అన్నారు.
also read:
- ఆ సినిమా నుండి దాసరి చిరంజీవిని తప్పించాలని చూశారా..? సంచలన విషయాలు బయటపెట్టిన సీనియర్ డైరెక్టర్..!
- చిరంజీవి అయినా ఎవడైనా సరే మా నాన్న తరువాతే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!