Home » నందమూరి తారకరత్న సేఫ్.. డాక్టర్లకు అందని మిరాకిల్ !

నందమూరి తారకరత్న సేఫ్.. డాక్టర్లకు అందని మిరాకిల్ !

by Bunty
Ad

తారకరత్న నారాలోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన క్రమంలో ఆయనకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారని తెలుస్తోంది. తారకరత్న గుండెలో దాదాపు 95% బ్లాక్ అయిందని, మొత్తంగా గుండె పనిచేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు. తాజాగా తారకరత్న బాబాయి, అబ్బాయి తారకరత్న హెల్త్ కండిషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

read also : వెంకటేష్ కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా?

Advertisement

మొన్న శుక్రవారం తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ రావడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే కదా. ముందు ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిన, తర్వాత మళ్ళీ గుండె కొట్టుకోవడం మిరాకిల్ అని చెప్పారు. శరీరంలో మిగతా ఆర్గాన్స్ అన్ని బాగానే ఉన్నాయి. నిన్నటి కన్నా ఈరోజు ఈయన హెల్త్ కండిషన్ బాగుందన్నారు. గుండె నాళాల్లోకి స్టంట్ వేయడానికి ఆయనకు డాక్టర్లు కొన్ని మందులు వేస్తున్నారు. మళ్ళీ గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉన్నందున డాక్టర్లు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారని బాలకృష్ణ చెప్పారు.

Advertisement

అటు తారకరత్న శరీరం ట్రీట్మెంట్ కు సహకరిస్తుందని, ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ మీడియాకు చెప్పారు. ఇక అటు మంచు మనోజ్ కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందనే విషయాన్ని చెప్పారు. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తున్న విషయాన్ని చెప్పారు. దీంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా, లేటెస్ట్ గా తారకరత్న సేఫ్ అని వైద్యులు చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని చెబుతున్నారు వైద్యులు. సోమవారం చేసే పరీక్షల్లో దీనిపై ఇంకా క్లారిటీ రానుందట.

READ ALSO : TarakaRatna : తారక రత్న హెల్త్ బులిటెన్ సరికొత్త విషయాలను బయటపెట్టిన వైద్యులు !

Visitors Are Also Reading