Home » ISRO : ఇస్రోకు కోట్లాది రూపాయలు ఆదా చేసిన తమిళనాడు మట్టి…!

ISRO : ఇస్రోకు కోట్లాది రూపాయలు ఆదా చేసిన తమిళనాడు మట్టి…!

by Bunty
Ad

 

చంద్రయాన్- 3 విజయం ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో భారత్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ఇక ఇస్రో సక్సెస్ స్టోరీలో తమిళనాడుది ప్రత్యేక స్థానం. ఎంతోమంది తమిళ ప్రముకులు ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం, చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ మైల్ స్వామి అన్నాదురై, చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్ వంటి శాస్త్రవేత్తలు ఇస్రో పరిశోధనకు కృషి చేశారు. అయితే తమిళనాడు శాస్త్రవేత్తలే కాకుండా అక్కడ మట్టి కూడా ఇస్రోకి ఎంతో ఉపయోగపడింది. చంద్రయాన్-3 ప్రాజెక్టులో కూడా ఆ మట్టి కీలక పాత్ర పోషించింది.

Advertisement

చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ని సురక్షితంగా సేఫ్ గా ల్యాండ్ చేయడం రోవర్ ప్రోగ్రాం చేసిన విధంగా పరిశోధన చేపట్టిన వాటిని పరీక్షించాలని ఉంటుంది. అందుకోసం చంద్రుడిపై ఉన్న వాతావరణాన్ని భూమిపై కృత్రిమంగా తయారు చేయవలసి ఉంటుంది. దీనికి సుమారు 60 నుంచి 70 టన్నుల చంద్రుడుపై ఉన్న మట్టి అవసరమవుతుంది. గతంలో ఈ లక్షణాలు గల మట్టిని అమెరికా నుంచి కిలోకి 150 డాలర్లు ఇచ్చి కొనుక్కునేవారు. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు తగ్గించేందుకు అలాంటి మట్టి కోసం మన జువాలజిస్టులు పరిశోధనలు చేశారు.

Advertisement

ఈ క్రమంలో చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నమ్మకల్ ప్రాంతంలో ఉన్న మట్టి చంద్రయాన్ మిషన్ టెస్ట్ కోసం 2012 నుంచి సరాఫరా అవుతుంది. ఈ మట్టి చంద్రునిపై ఉన్న మట్టికి దగ్గరగా ఉన్నందున చంద్రయన్ లాండర్, రోవర్ల సామర్థ్యంలను పరిశీలించడానికి, మెరుగుపరచడానికి ఇస్రోకి వీలు కలిగింది. దానికి అవసరమైనప్పుడల్లా పెరివార్ విశ్వవిద్యాలయంలోని జువాలజీ విభాగంలో ఈ మట్టిని సరాఫరా చేసింది. నమ్మకల్ సహా దాని చుట్టుపక్క గ్రామాలు సీతంపుడి, ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మట్టి సమృద్ధంగా లభ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి 

హీరో అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రియ భూపాల్… ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఎంజాయ్…!

విజయ్కి మిడ్ నైట్ వీడియో కాల్ చేసిన సమంత.. ఏమైంది?

ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?

Visitors Are Also Reading