Home » తమిళ్ మూవీలు కానీ తెలుగులో ఎక్కువ కలెక్షన్లు… ఆ మూవీలు ఇవే..!

తమిళ్ మూవీలు కానీ తెలుగులో ఎక్కువ కలెక్షన్లు… ఆ మూవీలు ఇవే..!

by AJAY
Ad

తమిళ సినిమాలను మనవాళ్లు సొంత సినిమాల్ల ఆదరిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. కొన్ని తమిళ సినిమాలు కోలీవుడ్ ఇండస్ట్రీలో కంటే కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లను వసూలు చేసినవి ఉన్నాయి. మరి అలా కోలీవుడ్ సినిమాలు అక్కడితో పోలిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ కలక్షన్లను వసూలు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

Advertisement

24 : సూర్య హీరోగా రూపొందిన ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటించగా విక్రమ్ కే కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో రూపొందింది. ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేశారు. ఇలా తమిళ, తెలుగు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ కంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ కలక్షన్లను వసూలు చేసింది.

Advertisement

బిచ్చగాడు : విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన ఈ తమిళ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ తో పోలిస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది.

వాతి / సార్ : తమిళ నటుడు ధనుష్ హీరోగా రూపొందిన వాతి అనే సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా… సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. తమిళంలో రూపొందిన ఈ సినిమాను సార్ అనే పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ తమిళ సినిమా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లను రాబట్టింది.

Bichagadu 2 OTT

బిచ్చగాడు 2 : విజయ్ ఆంటోనీ హీరోగా మరియు స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కావ్య తప్పర్ హీరోయిన్గా నటించింది. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కూడా తమిళ్ లో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది.

Visitors Are Also Reading