ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లుగా రాణిస్తున్న వారి లిస్టులో థమన్ కూడా ఒకరు. థమన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు. వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాలకు సైతం మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రస్తుతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఆయనపై ట్రోల్స్ కూడా అదే రేంజ్ లో వస్తూ ఉంటాయి.
Advertisement
థమన్ మ్యూజిక్ ను కాపీ కొడతారు అంటూ ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఏ సినిమా నుండి ఆల్బమ్ విడుదలైనా అందులోని పాటలు విడుదలైనప్పుడు మ్యూజిక్ లేపేశాడు అంటూ ఆరోపణలు వినిపిస్తుంటాయి. అయితే తాజాగా థమన్ పై వస్తున్న ట్రోల్స్ పై ఆయన భార్య వర్ధిని స్పందించారు. వర్ధిని కూడా సింగర్ గా రాణిస్తున్నారు.
Advertisement
మొదట ఈటీవీలో ప్రసారమయ్యే స్వరాభిషేకం టీవీ షో ద్వారా వర్ధిని ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలలో పాటలు పాడారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వర్ధిని మాట్లాడుతూ… మేము ఇంట్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అసలు మాట్లాడుకోమని అన్నారు.
కానీ థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ విడుదలైనప్పుడు… ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలను అప్పుడప్పుడు చూస్తుంటామని చెప్పారు. వాటికింద కొన్ని నెగెటివ్ కామెంట్ లు చూసి ఒకరోజు తన మూడ్ మొత్తం పాడైపోయింది అన్నారు. ఆ రోజు అన్నం కూడా తినలేకపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆనాటి నుండి థమన్ యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్స్ చూడడం మానేశానని అన్నారు.