మన మనసులో తలెత్తే భావాలకి హార్మోన్లే కారణము. కొన్ని హార్మోన్ల వలన మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేసే ఆహార పదార్థాల గురించి చూద్దాం. వీటిని కనుక తీసుకున్నట్లయితే, సంతోషంగా ఉండొచ్చు. డార్క్ చాక్లెట్ ని తీసుకోవడం వలన శరీరంలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. మూడ్ మెరుగు పడుతుంది మానసిక ఉల్లాసం కలుగుతుంది. అలానే సాల్మన్ చేపలని తీసుకుంటే కూడా మంచిది. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ బాగా ఉంటాయి. అలానే మంచి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది ఫీలింగ్స్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.
Advertisement
Advertisement
రకరకాల విటమిన్స్ మినరల్స్ వుండే అరటి పండ్లు తీసుకుంటే కూడా మూడ్ బాగుంటుంది హ్యాపీ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లూ బెర్రీస్ స్ట్రాబెరీస్ ని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుంది. బాదం గుమ్మడికాయ గింజలు కూడా మంచి మూడ్ అందేటట్టు చూస్తాయి. పెరుగు వంటివి కూడా తీసుకోండి పసుపులో కూడా చక్కటి గుణాలు ఉంటాయి ఇది డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుంది మూడ్ బాగుండేటట్టు చూస్తుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!