ప్రతి రోజు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఎలా అయితే మంచి ఆహార పదార్థాలని రోజు తీసుకోవాలో అలానే మంచినీళ్ళని కూడా రోజు తీసుకుంటూ ఉండాలి. రోజు కనీసం 8 గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కానీ చాలామంది ఎక్కువ నీళ్లు తాగడానికి ఇష్టపడరు. ఆఫీస్ పనిలో మునిగిపోవడం వలన చాలామంది మంచినీళ్లు తాగడమే మర్చిపోతూ ఉంటారు. కొన్ని లక్షణాల ద్వారా సరిపడా నీళ్లు తీసుకోవడం లేదని మనం గుర్తించొచ్చు.
Advertisement
దీంతో మంచినీళ్లు సరిగా తాగట్లేదు అని తెలుసుకొని, మంచి నీళ్లు తాగడం మంచిది మంచినీళ్లు సరిగ్గా తీసుకోకపోతే చర్మం సాగినట్లుగా పొడిపొడిగా మారిపోతుంది. ఇలా ఉన్నట్లయితే కచ్చితంగా నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. పెదాలు ఎండిపోయినట్లు కనిపిస్తే కూడా మంచి నీళ్లు సరిగ్గా తీసుకోవట్లేదు అని అర్థం. తరచు తలనొప్పి వస్తున్నట్లయితే మంచినీళ్లు సరిగ్గా తీసుకోవట్లేదు అని తెలుసుకోవాలి. కాళ్లు చేతులు శరీరం తిమ్మిర్లు వచ్చినట్లు అనిపిస్తే కూడా మంచినీళ్లు తక్కువ తీసుకుంటున్నారని అర్థం.
Advertisement
మూత్రం రంగులో తేడాలు వచ్చినట్లయితే కూడా సరిపడ నీళ్లు తీసుకోవట్లేదని గ్రహించాలి గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు కూడా మంచినీళ్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన కలుగుతాయి. అలానే మంచి నీళ్లు సరిగ్గా తీసుకోకపోతే మలబద్దకం సమస్య కూడా ఉంటుంది. ఇలా వీటిని మీరు ఎదుర్కొంటున్నట్లయితే మంచినీళ్లు తక్కువ తీసుకుంటున్నారని అర్థం.
Also read:
- ఐస్ తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.. ఇలా మసాజ్ చేస్తే చాలు..!
- మిక్సర్ గ్రైండర్ ని ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు.. అది కూడా క్షణాల్లోనే..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి