తెలుగు సినిమా అంటే ముందుగా గుర్తుకు వచ్చే నటుడు ఎస్వీ రంగారావు. ఆయన నటనతో విశ్వనట చక్రవర్తి అనే బిరుదును సంపాదించుకున్నారు. అంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఎస్వీ రంగారావు 30 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఒకవేళ ఆయన ఇంగ్లీష్ సినిమాలు చేసి ఉంటే ఆస్కార్ వచ్చి ఉండేదని చెబుతుంటారు.
Advertisement
ఓవైపు నటుడిగా మరోవైపు దర్శకుడిగా ఎస్వి రంగారావు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. కేవలం ఒకే రకమైన పాత్రలకు అంకితం అవ్వకుండా అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మైమరపించారు. అయితే ఎస్వి రంగారావు సినిమా జీవితం గురించి కొంతవరకు తెలుసు… కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఎస్.వి.రంగారావు పెళ్లినాటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకుందాం….
Advertisement
ఎస్వి రంగారావు 1947లో లీలావతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఎస్వీ రంగారావు లీలావతి దంపతులకు ప్రమీల, విజయ, కోటేశ్వరరావు అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఇదిలా ఉంటే ఎస్వీ రంగారావు తండ్రి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. రాజమండ్రి కి సమీపంలో ఉన్న ధవలేశ్వరంలో ఎస్వీ రంగారావు జన్మించారు. ఎస్వి రంగారావు కూడా చదువుల్లో రాణించి డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత అగ్నిమాపక శాఖలో ఉద్యోగం చేసేవారు.
ఆ తర్వాత నటన పై ఆసక్తితో నాటకాల్లో రాణించారు. సినిమాల్లో మొట్టమొదట హిరణ్య కస్యపుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఎస్వీ రంగారావు మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడిగా నటించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఇక ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఎస్వీ రంగారావు 56 ఇళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించడం బాధాకరం.