Home » ‘యమలీల’ లో మహేష్ ని పెట్టి సినిమా చేద్దాం అని ! ఆలీని హీరో ఎలా చేసారు ? sv కృష్ణ రెడ్డి చెప్పిన విషయాలు !

‘యమలీల’ లో మహేష్ ని పెట్టి సినిమా చేద్దాం అని ! ఆలీని హీరో ఎలా చేసారు ? sv కృష్ణ రెడ్డి చెప్పిన విషయాలు !

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్‌లో 1994వ సంవ‌త్స‌రంలో ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన య‌మ‌లీల చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజయం సాధించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా తెలుగు ప్ర‌ముఖ క‌మెడీయ‌న్, హీరో ఆలీ న‌టించ‌గా హీరోయిన్‌గా టాలీవుడ్ వెట‌ర‌న్ ఇంద్ర‌జ న‌టించింది. ఈ చిత్రంలో ప్ర‌ముఖ హాస్య న‌టుడు బ్ర‌హ్మనందం, సీనియ‌ర్ న‌టులు కైకాల స‌త్య‌నారాయ‌ణ, కోట శ్రీ‌నివాస‌రావు, త‌నికెళ్ల భ‌ర‌ణి, మంజు భార్గ‌వి, స్వ‌ర్గీయ న‌టులు ఏవీఎస్‌, గుండు హ‌న్మంత‌రావు త‌దిత‌రులు న‌టించారు.

Advertisement

అమ్మ సెంటిమెంట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అదేవిధంగా ఈ చిత్రంలో సిరులొలికించే చిన్ని న‌వ్వులే అనే పాట ఇప్ప‌టికీ చాలా మంది ఫేవ‌రేట్ సాంగ్స్ లిస్ట్‌లో ఉంటుంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు సంగీతాన్ని కూడా అందించ‌గా తెలుగు ప్ర‌ముఖ సీనియ‌ర్ సినీ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. తొలుత య‌మ‌లీల చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తొలుత టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబుతో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశాడ‌ట‌. ఈ త‌రుణంలో మ‌హేష్‌బాబు తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను క‌లిసి య‌మ‌లీల క‌థ‌ను కూడా చెప్పాడ‌ట‌.

కానీ య‌మ‌లీల సినిమా తీసిన స‌మ‌యంలో మ‌హేష్ బాబు చ‌దువుకుంటున్నాడ‌ని అలాగే మ‌హేష్‌బాబు తో సినిమా తీయాలంటే మ‌రొక ఐదు సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని చెప్పార‌ట‌. ఈ క్ర‌మంలో సూప‌ర్ స్టార్ కృష్ణ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆఫ‌ర్‌ను సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ట‌. ఎస్వీ కృష్ణారెడ్డి య‌మ‌లీల చిత్రాన్ని క‌మెడియ‌న్ ఆలీతో తెర‌కెక్కించాల‌ని నిర్ణ‌యం తీసుకుని అనుకున్న‌దే త‌డ‌వుగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌కి చెప్ప‌డంతో వెంట‌నే ఒప్పుకున్నాడ‌ట‌.

Advertisement

నిర్మాత అచ్చిరెడ్డి కూడా అంగీక‌రించ‌డంతో ఆలీతో య‌మ‌లీల చిత్రాన్ని తెర‌కెక్కించారు. య‌మ‌లీల చిత్రాన్ని తెర‌కెక్కించిన స‌మయంలో ఆలీకి పెద్ద‌గా ఫేమ్ లేక‌పోవ‌డంతో తొలుత కొంత మంది అభ్యంత‌రాలు తెలిపిన‌ప్ప‌టికీ ఎస్వీ కృష్ణారెడ్డి మాత్రం వీటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా త‌న‌కు త‌న క‌థ‌పై పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పాడ‌ట‌. య‌మ‌లీల చిత్రం తెర‌కెక్కించిన స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి అప్ప‌టికే మాయ‌లోడు, రాజేంద్రుడు-గ‌జేంద్రుడు, నెంబ‌ర్ వ‌న్ వంటి చిత్రాల వ‌రుస హిట్ల‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. క‌థ‌ను న‌మ్మి సినిమా తీస్తే ఫ‌లితం ఏవిధంగా ఉంటుందో ఎస్వీ కృష్ణారెడ్డి య‌మ‌లీల చిత్రం ద్వారా నిరూపించాడు.

Also read: క‌థ న‌చ్చ‌క కాద‌ట‌..మ‌హేశ్ బాబు పుష్ప‌ను రిజెక్ట్ చేయ‌డం వెన‌క ఇంత క‌థ ఉందా..?

ముఖ్యంగా య‌మ‌లీల చిత్రం కోసం అప్ప‌ట్లోనే దాదాపు 75 ల‌క్ష‌ల రూపాయ‌లు బ‌డ్జెట్ వెచ్చించారు. కానీ ఈ చిత్రం దాదాపుగా 12 కోట్ల రూపాయ‌లకు పైగా వ‌సూళ్ల‌ను సాధించి ఔరా అనిపించింది. అంతేకాకుండా నైజాం, సీడెడ్‌, ఆంధ్ర త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌లు థియేట‌ర్ల‌లో 100 రోజుల‌కు పైగా ఆడింది. అయితే య‌మ‌లీల చిత్రాన్ని తెర‌కెక్కించిన 20 సంవ‌త్స‌రాల త‌రువాత ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి మ‌ళ్లీ 2014 సంవ‌త్స‌రంలో య‌మ‌లీల‌2 చిత్రాన్ని తీశాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇక అప్ప‌టి నుంచి ఎస్వీ కృష్ణారెడ్డి ఇండ‌స్ట్రీకి కొంచెం దూరంగా ఉంటున్నాడు.

Also Read: నేడే బీస్ట్ ట్రైల‌ర్‌.. ఏడు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన డైరెక్ట‌ర్

Visitors Are Also Reading