Home » క‌థ న‌చ్చ‌క కాద‌ట‌..మ‌హేశ్ బాబు పుష్ప‌ను రిజెక్ట్ చేయ‌డం వెన‌క ఇంత క‌థ ఉందా..?

క‌థ న‌చ్చ‌క కాద‌ట‌..మ‌హేశ్ బాబు పుష్ప‌ను రిజెక్ట్ చేయ‌డం వెన‌క ఇంత క‌థ ఉందా..?

by AJAY
Published: Last Updated on
Ad

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ పుష్ఫ‌. ఈ సినిమాకు మొద‌ట మిక్స్డ్ టాక్ రాగా మెల్లి మెల్లిగా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. గంద‌పు చక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేశారు. కాగా అంత‌టా పుష్ప‌కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాతో సుకుమార్ బ‌న్నీ కాంబోలో హాట్రిక్ కూడా న‌మోద‌ల‌య్యింది. సినిమాలోని పాట‌లు తీసిన విధానం అన్నీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

Advertisement

అయితే ఈ సినిమాను మొద‌ట సుకుమార్ మ‌హేశ్ బాబుకు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని మ‌హేశ్ బాబు స్వ‌యంగా ట్వీట్ చేశారు. సుకుమార్ తో మొద‌ట సినిమా ఒప్పుకోగా ఆ త‌ర‌వాత ప్రాజెక్ట్ ఆగిపోయింద‌ని పేర్కొన్నాడు. అయితే సుకుమార్ చెప్పిన క‌థ త‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ సినిమాను రిజెక్ట్ చేశార‌ని అప్ప‌ట్లో టాలీవుడ్ లో టాక్ వినిపించింది.

Advertisement

అయితే మహేశ్ బాబు ఈ సినిమాకు నో చెప్ప‌డం వెన‌క అస‌లు కార‌ణం వేరే ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌హేశ్ బాబు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 25 రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుద‌ల కాగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఇప్పుడు అంద‌రి క‌న్ను మ‌హేశ్ బాబు రాజ‌మౌళి ఫ్యూచ‌ర్ సినిమా పైనే ఉంది. ఇక ఈ సినిమా క‌థ ఆఫ్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో ఉండ‌బోతుంద‌ట‌.

ఇవి కూడా చదవండి: అల్లు అర్జున్ రీల్ లైఫ్ తల్లి జీవితంలో ఇన్ని కష్టాలు పడిందా….చదివితే కన్నీళ్లు ఆగవు …

ఇక పుష్ప సినిమా కూడా అడ‌వుల బ్యాక్ డ్రాప్ లోనే తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ అడ‌వుల వ‌స్తే బాగుండ‌ద‌నే కార‌ణంతోనే మ‌హేశ్ బాబు పుష్పను రిజెక్ట్ చేశార‌ట‌. అయితే ఇందులో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే మ‌హేశ్ బాబు నోరు విప్పాల్సిందే.

ఇవి కూడా చదవండి: అతిలోక సుందరి ‘శ్రీదేవి’ వలన ఆగిపోయిన చిరు సినిమాలు అన్ని ఉన్నాయా ? 

Visitors Are Also Reading