Home » నేడే బీస్ట్ ట్రైల‌ర్‌.. ఏడు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన డైరెక్ట‌ర్

నేడే బీస్ట్ ట్రైల‌ర్‌.. ఏడు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన డైరెక్ట‌ర్

by Anji
Ad

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్, బుట్ట‌బొమ్మ పూజాహెగ్దే జంట‌గా న‌టించిన చిత్రం బీస్ట్‌. డాక్ట‌ర్ ఫేమ్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 13న బీస్ట్ విడుద‌ల కానున్న‌ది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌లు సినిమాపై భారీ అంచ‌నాల‌ను న‌మోదు చేశాయి. ద‌ళ‌ప‌తి అభిమానులు సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా బీస్ట్ చిత్ర బృందం ట్రైల‌ర్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది.

Advertisement

 

ఉగాది పండుగ సంద‌ర్భంగా ఇవాల సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మేము కూడా మీ లాగే బీస్ట్ ట్రైల‌ర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నామ‌ని ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు విజ‌య్‌, పూజా హెగ్దేల‌తో పాటు ప‌లువురు న‌టులు గోడ‌చాటు నుంచి తొంగి చూస్తున్న‌ట్టు ఉండే ఫోటోను జ‌త చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన అరబిక్ కుత్తూ, జాల్లీ ఓ జింఖానా సాంగ్స్ హిట్ అయిన విష‌యం తెలిసిన‌దే. ఇటీవ‌ల ఈ సినిమా డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు పంచుకున్నాడు.

Advertisement

ఆస‌క్తిక‌ర విష‌యాలు

1. బీస్ట్ సినిమాలో ద‌ళ‌ప‌తి విజ‌య్ వీర రాఘ‌వ పాత్ర‌లో రా ఏజెంట్‌గా క‌నిపించ‌నున్నాడు.

2. కొల‌మావు కోకిల, డాక్ట‌ర్ సినిమా లాగా బీస్ట్ ఉండ‌దు. యాక్ష‌న్‌, కామెడీ నేప‌థ్యంలో సినిమా ఉంటుంది.

3. బీస్ట్ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి. మూడో పాట క‌థ‌లో భాగంగా వ‌స్తుంది.

4. విజ‌య్‌తో త‌ప్ప ఈసినిమా మ‌రే ఇత‌ర హీరోతో చేయ‌లేను.

5. సినిమాలో విల‌న్‌గా న‌టించ‌డానికి ఓ కొత్త న‌టుడి కోసం వెతుకుతున్న స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ క‌నిపించాడు.

6. విజ‌య్ ఎత్తుకు త‌గ్గ హీరోయిన్ కోసం నెల్స‌న్ వెతుకుతున్న స‌మ‌యంలో పూజాహెగ్దే క‌నిపించింది.

7. త‌దుప‌రి సినిమా స్క్రిప్ట్‌ను సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు చెప్ప‌డంలో విజ‌య్ కీల‌క పాత్ర పోషించాడు.

Visitors Are Also Reading