శుభలగ్నం, ఘటోత్కచుడు లాంటి సినిమాలతో సూపర్ హిట్ లు అందుకున్న దర్శకుడు ఎస్.వీ కృష్ణారెడ్డి. అంతే కాకుండా కమెడియన్ అలీతో యమలీల అనే సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తరవాత ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి పేరు సంపాదించుకున్నారు. నటుడిగా దర్శకుడిగా ఎస్వీ కృష్ణా రెడ్డి టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చివరగా ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ALSO READ : ప్రేమదేశంతో యూత్ ఐకాన్ మారిన అబ్బాస్..కానీ ఆ ఒక్క నిర్ణయంతో కెరీర్ ఖతం..!
Advertisement
కానీ ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఆ తరవాత ఆయన సినిమాలకు దూరం అయ్యారు. హీరోయిన్ లను ఎంతో పద్దతిగా చూపించడంతో ఎస్వీ కృష్ణా రెడ్డి ముందు వరుసలో ఉంటారు. సన్నీలియోన్ ను హీరోయిన్ గా తీసుకున్నా ఎస్వీ కృష్ణారెడ్డి ఆమెను పద్ధతిగానే చూపిస్తారని ప్రేక్షకులు సరరదాగా అనుకుంటూ ఉంటారు.
Advertisement
అంతే కాకుండా ఎస్వీ కృష్ణారెడ్డి షూటింగ్ సమయంలో కూడా హీరోయిన్ లను ఎంతో పద్దతిగా చూసుకుంటారని గౌరవిస్తారని ఆయన సినిమాలలో నటించిన హీరోయిన్ లు చెప్పేవారు. సినిమా షూటింగ్ పూర్తయిన తరవాత కూడా హీరోయిన్ లకు డబ్బులతో పాటూ వెండి పల్లెంలో పట్టుచీరలు పెట్టి సన్మానం చేసేవారని చెబుతుంటారు. అయితే ఇదే విషయంపై ఎస్వీ కృష్ణారెడ్డిని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అది అమ్మ నుండి నేర్చుకుంటామని అన్నారు.
తల్లి కూడా ఆడదే…భార్య, కూతుళ్లు కూడా ఆడవాళ్లే కాబట్టి ఆడవాళ్లు ఎక్కడున్నా వారని గౌరవించాలని అన్నారు. మన ఇంట్లో ఆడవాళ్లకు సంపద ఇవ్వకపోయినా మనం ఉండే తీరుతో ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పారు. తన సినిమాలలో కూడా అశ్లీలత ఉండదని అలా వినోదాన్ని పంచకుండా కామెడీతో ముందుకు తీసుకెళతానని చెప్పారు.