భారత జట్టు తరపున టీ20 ఫార్మాట్ లో మొదటి సెంచరీ ఆటగాడిగా సురేష్ రైనాకు రికార్డు అనేది ఉన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ అనేది ప్రారంభమైన తర్వాత నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న రైనాను గత ఏడాది జరిగిన మెగా వేలానికి ఆ జట్టు వదిలేసింది. ఆ తర్వాత మళ్ళీ వేలంలో రైనాను చెన్నై తీసుకోకపోగా.. వేరే జట్టు కూడా కొనుగోలు చేయలేదు.
Advertisement
దాంతో మిస్టర్ ఐపీఎల్ గా పేరు సంపాదించుకున్న రైనా ఐపీఎల్ 2022 సీజన్ లో ఆడలేకపోయాడు. ఆ కారణంగా రైనా ఐపీఎల్ అనేది ముగిసిన తర్వాత.. దేశవాళీ క్రికెట్ తో పాటుగా ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ అనేది ఇచ్చాడు. దాంతో రైనా విదేశీ లీగ్స్ లో ఆడటానికే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు అనే వాదన అనేది నడిచింది.
Advertisement
ఎందుకంటే బీసీసీఐ నియమాల ప్రకారం ఐపీఎల్ లో ఆడాలి అంటే భారత ఆటగాళ్లు ఎవరు విదేశీ లీగ్స్ లో ఆడకూడదు. అందుకే ఐపీఎల్ నుండి తప్పుకున్న రైనా తాజాగా అబుదాబిలో జరిగే టీ10 లీగ్ లో డక్కన్ గ్లాడియేటర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ లీగ్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రపంచ కప్ విన్నర్ తమ లీగ్ లో ఆడటం సంతోషం అని పేర్కొంది. చూడాలి మరి ఈ టీ10 లీగ్ లో రైనా ఎలా రాణిస్తాడు అనేది.
ఇవి కూడా చదవండి :